Skip to main content

మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? కోర్సు వివరాలను తెలపండి?

-రమేష్, కర్నూలు.
Question
మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? కోర్సు వివరాలను తెలపండి?
మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగించే యంత్రాల (మెషీన్స్)కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాలను మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో మైనింగ్ కోసం ఉపయోగించే యంత్రాలు, ఖనిజాల వెలికితీత విధానాలను వివరిస్తారు. ఈ క్రమంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ, మెకానిక్స్, ప్లానింగ్, మైన్ డెవలప్‌మెంట్, జియో మెకానిక్స్, గ్రౌండ్ కంట్రోల్, సర్ఫేస్ ఎన్విరాన్‌మెంట్, సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్ట్‌లను బోధిస్తారు. ధన్‌బాద్ (జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్.. బీటెక్, ఎంటెక్ విభాగాల్లో మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. గేట్ ద్వారా ఎంటెక్ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.
వివరాలకు: www.ismdhanbad.ac.in

కోర్సు పూర్తయిన తర్వాత మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మైనింగ్ ఇంజనీర్, జియ లాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెకానిక్ ఆపరేటర్, మైనింగ్ సూపర్‌వైజర్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.

టాప్ రిక్రూటర్స్: భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్, భారత్ ఫ్రోగ్ లిమిటెడ్, కెయిర్న్ ఎనర్జీ, అదానీ మైనింగ్.

Photo Stories