గేట్-2018తో పీఎస్‌యూలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియజేయండి?
- ఎన్.విజయ, ఆర్.త్రినాథ్, హైదరాబాద్.
Question
గేట్-2018తో పీఎస్‌యూలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలియజేయండి?
- గేట్ 2018కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ అక్టోబరు 5, 2017.
- గేట్ స్కోర్ ఆధారంగా పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు.. ముందుగా ఆయా పీఎస్‌యూల నోటిఫికేషన్లకు అనుగుణంగా సంబంధిత తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- తర్వాత దశలో గేట్ ఫలితాలు విడుదలైన తర్వాత సదరు పీఎస్‌యూలు నిర్దిష్ట కటాఫ్‌ను పేర్కొని.. సంబంధిత స్కోర్ పొందిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను అప్‌లోడ్ చేయమని అడుగుతాయి.
- ఇలా నిర్దిష్ట స్కోర్ పొంది.. తమ స్కోర్ కార్డ్‌ను అప్‌లోడ్ చేసిన అభ్యర్థులకు తదుపరి దశలో ఆయా పీఎస్‌యూల నియామక విధానాల ప్రకారం- ఇంటర్వ్యూ కాల్ అందుతుంది. ఇదే క్రమంలో ఇంటర్వ్యూ కంటే ముందు గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌ను సైతం నిర్వహిస్తారు.
- గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలకు గేట్ నిర్వాహక సంస్థ.. విద్యార్థుల స్కోర్‌ను పీఎస్‌యూలకు అందించే విధానం ప్రస్తుతం అమల్లో లేదు.
- విద్యార్థులు తప్పనిసరిగా ముందుగా ఆయా పీఎస్‌యూల నోటిఫికేషన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకుని.. గేట్ ఫలితాలు విడుదలయ్యాక సదరు పీఎస్‌యూలు నిర్దేశించిన కటాఫ్ స్కోర్ ఆధారంగా ప్రత్యేకంగా మరోసారి గేట్‌స్కోర్ కార్డ్‌ను అప్‌లోడ్ చేసుకుంటేనే పీఎస్‌యూల నుంచి ఇంటర్వ్యూ కాల్ అందుతుంది.