Skip to main content

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి.

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది.
Question
ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలియజేయండి.
  • కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను బోధిస్తారు.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు...
  1. రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఇది సిస్మిక్ వల్నరబిలిటీ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్; సాయిల్ డైనమిక్స్; స్ట్రక్చరల్ డైనమిక్స్ స్పెషలైజేషన్లలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
    అర్హత: సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
    వెబ్‌సైట్: www.iitr.ac.in
  2. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఎంటెక్ ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
    అర్హత: 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
    వెబ్‌సైట్: https://jmi.ac.in
  3. హైదరాబాద్‌లోని సీబీఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం.. ఎంఈ (ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తోంది.
    అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
    వెబ్‌సైట్: https://www.cbit.ac.in  

Photo Stories