Skip to main content

ఎంపీసీ ఇంటర్మీడియెట్ పాసయ్యాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు తక్కువని చెబుతున్నారు. ...

- కె.అక్షర, సూర్యాపేట.
Question
ఎంపీసీ ఇంటర్మీడియెట్ పాసయ్యాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరాలన్నది నా లక్ష్యం. అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు తక్కువని చెబుతున్నారు. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరడం మంచిదేనా?
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసుకున్న వారు దేశంలోని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్, పవన్ హన్‌‌సతోపాటు ఇతర ప్రైవేటు చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందుకునే వీలుంది. విమాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు.. బెంగళూరు, నాసిక్, కోరాపుట్, లక్నో, హైదరాబాద్ తదితర చోట్ల ఉన్న కేంద్రాల్లో ఏరోనాటికల్ ఇంజనీర్లకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే రక్షణ రంగంలో.. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు.. అత్యాధునిక విమానాలు, విమాన పరికరాల నిర్వహణ కోసం టెక్నికల్ బ్రాంచ్‌లోకి ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలు, డిజిటల్ కార్యక్రమాల్లో వేగం కనిపిస్తోంది. కాబట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న ప్రతిభావంతులు డీఆర్‌డీవో (డిఫెన్‌‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) లేబొరేటరీలు, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌ల్లో అవకాశాలు పొందొచ్చు. ఎంటెక్ పూర్తిచేస్తే ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగం లభించడం మరింత సులువవుతుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా సంబంధిత సబ్జెక్టు నాలెడ్‌‌జతోపాటు సదరు జాబ్‌కు అవసరమైన నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్ లెటర్ చేతికందుతుంది.

Photo Stories