Skip to main content

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు తెలియజేయండి. కోర్సు పూర్తయ్యాక ఇదే సబ్జెక్ట్‌తో జర్మనీలో ఎంఎస్ చేయడం ఎలా?

- ఆర్.సురేష్, హైదరాబాద్.
Question
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు తెలియజేయండి. కోర్సు పూర్తయ్యాక ఇదే సబ్జెక్ట్‌తో జర్మనీలో ఎంఎస్ చేయడం ఎలా?
ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్, మెషిన్ డ్రాయింగ్, ఆటోమోటివ్ ఇంజిన్స్, వెహికల్ డైనమిక్స్, ఆటో-ఎయిర్ కండిషనింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, క్యాడ్/కామ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఆటోమొబైల్ ఇంజనీర్లు ఆటోమోటివ్ డిజైన్, డెవలప్‌మెంట్, ఇంజిన్స్, ఎయిర్ కండిషనింగ్, అప్లికేషన్, సర్వీస్ వంటి విభాగాల్లో పనిచేస్తారు. ఈ వృత్తిలో రాణించడానికి ఎనలిటికల్ స్కిల్స్, క్యాడ్/క్యామ్ అంశాలపై పట్టు ఉండాలి.

ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారికి మారుతి, టాటా మోటార్స్, ఫోర్డ్, ఫియట్, టయోటా, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ రిక్రూటర్లుగా నిలుస్తున్నాయి.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేయడానికి అత్యధిక మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న దేశం జర్మనీ. 2011-12లో జర్మనీ విశ్వవిద్యాయాల్లో చదువుతున్న భారతీయుల సంఖ్య 5,998 కాగా, అది 2015-16కు 13,740కు చేరింది. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ కోర్సుకు టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ తదితర విశ్వవిద్యాలయాలు ప్రముఖమైనవి. ఇతర దేశాలతో పోల్చితే జర్మనీలో ఖర్చు చాలా తక్కువ. ఎంఎస్ కోర్సుకు అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. జీఆర్‌ఈ, టోఫెల్, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పూర్తి వివరాలకు: www.daad.de

Photo Stories