UGC NET: అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోండిలా...
Sakshi Education
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ).. డిసెంబర్ 2020, జూన్ 2021 యూజీసీ నీట్ పరీక్ష కోసం
అప్లికేషన్ కరెక్షన్ విండోను తెరిచింది.
అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోండిలా...
సెప్టెంబర్ 7న దీనిని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్ సైట్ లో చేయవచ్చు. కరెక్షన్ విండో సెప్టెంబర్ 12న మూసివేస్తారు. తర్వాత ఎటువంటి కరెక్షన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనుమతించదు. అప్లికేషన్ ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm Wallet ద్వారా అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అవకాశం సెప్టెంబర్ 6 న లేదా అంతకు ముందు అప్లై చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా పొడిగించిన ఒక సౌకర్యం మాత్రమే. అభ్యర్థులు గమనించి కరెక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.