“ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు”కు ఆహ్వానం అందుకున్న ఓయూ ప్రొఫెసర్
జూలై 17 నుంచి 21వ తేదీ వరకు కెనడాలోని మాంట్రియాల్ లో జరగనున్న 16వ “ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు” WCTR లో జరిగే ఓ చర్చలో ప్రొఫెసర్ కుమార్ భాగస్వామ్యం కానున్నారు. “అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ప్రయాణ ఆలస్యాన్ని తగ్గించటం” అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తారు. దాదాపు 175 దేశాల నుంచి పరిశోధకులు, ప్రొఫెసర్లు, పారిశ్రామిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రతి మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు 2023లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కటం విశేషం.
చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది
రవాణా సంబంధిత అంశాలపై ఐదు రోజుల పాటు విభిన్న విషయాలపై ప్రపంచ స్థాయి నిపుణులు చర్చిస్తారు. ఈ సదస్సులో జరిగే చర్చకు ప్రొఫెసర్ కుమార్ ఆహ్వానించటం... ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కిన గౌరవమని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇప్పటికే పదహారు దేశాల్లో పర్యటించిన ప్రొఫెసర్ కుమార్ 30కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. WCTR ఆహ్వానం పట్ల ప్రొఫెసర్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: ఓయూ విద్యార్థులంటే.. ఇలా ఉంటారు.. | Sekhar Kammula, Film Director, Producer