పది భాషల్లో దూర విద్య డీఎడ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్‌ట్రైన్డ్ టీచర్లకు పది భాషల్లో దూర విద్యలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సును అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(ఎన్‌ఐఓఎస్) చర్యలు చేపట్టిందని, ఆ విభాగం రీజనల్ డెరైక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు.
అభ్యర్థుల కోసం తెలుగులోనూ పుస్తకాలు రూపొందించి వెబ్‌సైట్‌లో (dled.nios.ac.in, swayam.gov.in) అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి అభ్యర్థి స్వయం పోర్టల్‌లో కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులకు సీడీ రూపంలో పాఠాలను అందిస్తున్నామని, ప్రత్యేక చానెల్ ద్వారా బోధన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Published date : 22 Dec 2017 01:09PM