మార్చి 26న అంబేడ్కర్ వర్సిటీ అర్హత పరీక్ష
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యా లయం అర్హత పరీక్ష-2017ను మా ర్చి 26న నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఈనెల 17న ఒక ప్రకటనలో తెలిపాయి.
గతంలో ప్రకటించిన విధంగా ఫిబ్రవరి 26న ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్ష ఉన్నందున అర్హత పరీక్ష తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. కనీస విద్యార్హత లేనివారు 18 సంవత్సరాల పైబడి ఉన్నట్లయితే ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా పేర్కొన్నారు. అర్హత పరీక్ష రాయాలనుకునేవారు మార్చి 16 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఏదైనా పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించారు.
Published date : 18 Feb 2017 03:28PM