ఏఎన్యూ దూరవిద్య కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) దూరవిద్యా కేంద్రం తెలుగు రాష్ట్రాల్లోని అధ్యయన కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్ డాక్టర్ కె.సుమంత్కుమార్ తెలిపారు.
28 పీజీ కోర్సులు, 17 డిగ్రీ కోర్సులు, 2 సర్టిఫికెట్ కోర్సులు, 16 డిప్లొమా కోర్సులు, 2 లైబ్రరీ సైన్స్ కోర్సులల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశాల ప్రక్రియ ఈనెల 14 నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు కొనసాగుతుందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డెబ్ అనుమతితో దూరవిద్య కోర్సుల నిర్వహణలో దేశంలోనే రెండో అతిపెద్ద వర్సిటీగా ఏఎన్యూ నిలిచిందని తెలిపారు. సంవత్సరాంతపు పరీక్షల నిర్వహణ విధానం ఈ బ్యాచ్ వరకే కొనసాగుతుందన్నారు. వచ్చే బ్యాచ్ నుంచి సెమిస్టర్ విధానంలో కోర్సులు, పరీక్షల నిర్వహణ చేపట్టనున్నామని వెల్లడించారు.
Published date : 16 Jan 2020 12:20PM