దూరవిద్యా కోర్సులకు హెచ్‌సీయూ దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ దూర విద్యా విభాగం (హైదరాబాద్) పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వాటిలో బిజినెస్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, సైబర్‌లాస్, ఫోరెన్సిక్ లాస్, కెమికల్ అనాలసిస్, హ్యుమన్‌రైట్స్, లైబ్రరీ ఆటోమేషన్, నెట్‌వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, మెడికల్ బోటనీ, ఎనర్జీ బొటనీ కోర్సులున్నాయి. ఈ నెల 29 వరకు దరఖాస్తులు అందజేయవచ్చు. ఇతర వివరాలకు www.uohyd.ac.in కు లేదా 040 24600264/265 నంబర్లలో సంప్రదించవచ్చు.
Published date : 12 Feb 2016 12:51PM