అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రవేశ పరీక్ష - 2017 ఫలితాలను ఆగస్టు 17న యూనివర్సిటీ విడుదల చేసింది.
ఆగస్టు6వ తేదీన నిర్వహించిన రెండో దఫా ప్రవేశ పరీక్షకు 14,512 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 12,018 మంది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు ఫలితాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. 2017-18 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వెల్లడించింది. ఫీజు చెల్లింపునకు ఆగస్టు26వ తేదీ ఆఖరి గడువని పేర్కొంది.
Published date : 18 Aug 2017 02:41PM