8 వరకు ఓపెన్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు
Sakshi Education
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ మొదటి, రెండో సంవత్సరం, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సంవత్సర వార్షిక పరీక్షలు డిసెంబర్, జనవరిలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 8లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలోని స్టడీ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 02 Dec 2015 04:05PM