Women Boxing: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2022 ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబరు 4న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రకటించింది. టర్కీలో రోజు 25 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అన్ని విభాగాల్లో పోటీపడుతున్నారు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు నేరుగా ఈ టోర్నీకి పంపారు. అయితే ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ (70 కిలోలు) జాతీయ బాక్సింగ్‌లో పోటీపడకపోయినా ఆమెకు అర్హత కల్పించారు.
వరుణ్–గణపతి జోడీకి టైటిల్..
ఒమన్‌లోని అల్–ముసన్నా పట్టణంలో జరిగిన ఆసియా 49ఈఆర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన వరుణ్ ఠక్కర్–కేసీ గణపతి జోడీ విజేతగా నిలిచింది. ఆసియా సెయిలింగ్ టోర్నీ చరిత్రలో వరుణ్–గణపతి జంటకిది మూడో పతకం. 2018లో ఈ జోడీ స్వర్ణం, 2019లో రజతం సాధించింది. మరోవైపు మహిళల విభాగంలో హర్షిత తోమర్–శ్వేత జోడీ రజత పతకం నెగ్గింది.
చదవండి: ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో స్వర్ణం సాధించిన షూటర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022 ఏడాదికి మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2021 వాయిదా
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం
ఎక్కడ : ఇస్తాంబుల్, టర్కీ
ఎందుకు : టర్కీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్