Ranji Trophy: రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు
Sakshi Education
భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు మహిళా అంపైర్లను బీసీసీఐ ఎంపిక చేసింది.
భారత క్రికెట్‌లో ఇది కొత్త మలుపు కానుందని బోర్డు అభిప్రాయ పడింది. వ్రిందా రాఠి (ముంబై), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (ఢిల్లీ)లకు ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 13న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లకు వీరు అంపైర్లుగా వ్యవహరిస్తారు. 32 ఏళ్ల వ్రిందా ముంబైలో చిన్న స్థాయి క్లబ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెట్టి బీసీసీఐ అంపైర్‌గా ఎదగగా, 43 ఏళ్ల గాయత్రి బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై 2019 నుంచి అంపైరింగ్ చేస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన 36 ఏళ్ల జనని క్రికెట్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలి అంపైరింగ్ వైపు వెళ్లింది.
BWF Rankings: తొలిసారి టాప్–20లోకి గాయత్రి జోడీ
Published date : 07 Dec 2022 03:22PM