Skip to main content

Veteran Spinner Harbhajan Singh : అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హర్భజన్..రికార్డులు ఇవే

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ డిసెంబర్ 24వ తేదీన‌ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
Veteran Spinner Harbhajan Singh
Veteran Spinner Harbhajan Singh

ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొన్నాడు. తనకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నాను, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తన సందేశాన్ని తెలిపాడు.

రికార్డులు ఇవే..
1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన 41 ఏళ్ల భజ్జీ..  టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా భజ్జీ 711 అంతర్జాతీయ వికెట్లను పడగొట్టాడు. అతని ఖాతాలో రెండు టెస్ట్‌ సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో మొత్తంలో 163 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్‌.. 150 వికెట్లు తీసి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు.

Published date : 24 Dec 2021 03:32PM

Photo Stories