Skip to main content

Shane Warne: షేన్‌వార్న్‌కు ఆసీస్‌ బోర్డు సముచిత గౌరవం

దివంగత క్రికెటర్‌ షేన్‌వార్న్‌ను ఆ్రస్టేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆ్రస్టేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌ అవార్డును షేన్‌వార్న్‌ పేరిట ఇవ్వనుంది.

ఇకపై ఈ అవార్డు ‘షేన్‌ వార్న్‌ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఆ్రస్టేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్‌ వార్న్‌ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా డిసెంబ‌ర్ 26న‌ ఈ విషయాన్ని ఆసీస్‌ బోర్డు ప్రకటించింది. లెగ్‌స్పిన్‌ దిగ్గజం వార్న్‌ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 27 Dec 2022 12:34PM

Photo Stories