T20 World Cup-2024 : ఈ దేశంలోనే 2024 టీ-20 ప్రపంచకప్..!
ఈ మేరకు 2024 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచన లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది.
ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నింటినీ..
అందులో భాగంగా 2024 టి20 ప్రపంచకప్‌ను అమెరికాలో విజయవంతంగా నిర్వహిస్తే... 2028 విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. అయితే ప్రపంచ కప్ మ్యాచ్‌లన్నింటినీ అమెరికాలోనే నిర్వహించడకుండా... కరీబియన్ దీవుల్లోనూ నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే 2014 టి20 ప్రపంచకప్ తర్వాత మరో ఐసీసీ మెగా ఈవెంట్ భారత్, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ దేశాల్లో కాకుండా మరో దేశంలో జరిగే అవకాశం ఉంటుంది.