Skip to main content

T20 World Cup 2022 Semi Final : ఒక వేళ జింబాబ్వే చేతిలో భార‌త్ ఓడితే.. టీమిండియా ప‌ని ఇంక అంతే..! ఎందుకంటే..?

న‌వంబ‌ర్ 3వ తేదీన సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌ గెలుపుతో గ్రూప్‌-2 సెమీస్‌ బెర్త్‌లు సంక్లిష్టంగా మారాయి. ఎందుకంటే.. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికాలు ఏ బాదరబందీ లేకుండా సెమీస్‌కు చేరతాయనుకుంటే పాక్‌ గెలుపుతో సమీకరణలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

చిన్న జట్టైన నెదార్లాండ్స్‌తో చివరి మ్యాచ్‌ ఆడాల్సి ఉండటంతో సౌతాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ..  టీమిండియానే ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

T20 World Cup Semi Final 2022 Teams : టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్‌ బెర్తులు ఆసక్తికరం.. గ్రూప్-1,2 లోని జ‌ట్లు..

ఏ మాత్రం జింబాబ్వే చేతిలో ఓడినా..

zim

సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌పై గెలిస్తే తొలి సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోనుండగా.. మరో బెర్తు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంటుంది. ఏమాత్రం అటుఇటు జరిగి భారత్‌.. జింబాబ్వే చేతిలో ఓడినా.. పాక్‌.. తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచినా.. మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా పాకిస్తానే సెమీస్‌కు వెళ్తుంది. కాబట్టి.. భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో జింబాబ్వేపై గెలిస్తేనే పాక్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. 

T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డుల‌ను ఎవరూ 

నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిందంటే..
భారత్‌.. జింబాబ్వేపై గెలిచి, పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిందంటే భారత్‌, పాక్‌లు సెమీస్‌కు చేరకుంటాయి. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదు. 

గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ రేసులో ఉన్న భారత్‌, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ జట్ల పాయింట్ల వివరాలు ఇలా..
భారత్‌.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 6 పాయింట్లు (రన్‌రేట్‌=0.730)
సౌతాఫ్రికా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు (రన్‌రేట్‌=1.402)
పాకిస్తాన్‌..4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు (రన్‌రేట్‌=1.085)

T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్‌-2022 విజేత, రన్నరప్ టీమ్‌ల‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

Published date : 03 Nov 2022 08:28PM

Photo Stories