ICC Rankings: ‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్ యాదవ్
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.
ఏప్రిల్ 19న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 906 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్లు మొహమ్మద్ రిజ్వాన్ (798 పాయింట్లు), బాబర్ ఆజమ్ (769 పాయింట్లు) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. విరాట్ కోహ్లి 15వ ర్యాంక్‌లో మార్పు లేదు.
Archery World Cup: డిప్యూటీ కలెక్టర్, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
Published date : 20 Apr 2023 04:07PM