Skip to main content

Slovenia Open: ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్‌.. చాంపియన్‌ సమీర్‌ వర్మ

ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సమీర్‌ వర్మ తన కెరీర్‌లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు.
Sameer Varma

స్లొవేనియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలో సమీర్‌ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్‌ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్‌ వర్మ 2018లో సయ్యద్‌ మోదీ సూపర్‌–300 టోర్నీలో టైటిల్‌ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్‌ కపూర్‌ జోడీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం సాధించారు.

Telangana CM KCR : ‘గ్రాండ్‌మాస్టర్‌’ ప్రణీత్‌కు రూ.2.5 కోట్లు ప్రోత్సాహకంగా ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

Published date : 24 May 2023 12:13PM

Photo Stories