Tennis: అడిలైడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన భారతీయ జంట?
అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. జనవరి 9న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. దీంతో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ 41 ఏళ్ల బోపన్న(బెంగళూరు) తన కెరీర్‌లో 20వ డబుల్స్ టైటిల్ సాధించినట్లయింది. 2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్‌లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
నలుగురు భారత ఆటగాళ్లతో..
ఏటీపీ టూర్‌లో బోపన్న 20 డబుల్స్ టైటిల్స్ నెగ్గగా ఇందులో ఐదు టైటిల్స్‌ను నలుగురు భారత ఆటగాళ్లతో కలిసి సాధించాడు. బోపన్న 2012లో మహేశ్ భూపతితో కలిసి దుబాయ్ ఓపెన్, పారిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచాడు. 2017లో జీవన్ నెదున్‌చెజియాన్‌తో చెన్నై ఓపెన్‌ను, 2019లో దివిజ్ శరణ్‌తో పుణే ఓపెన్‌ను, 2022 ఏడాది రామ్‌కుమార్‌తో అడిలైడ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు.
చదవండి: చక్దా సినిమాను ఎవరి జీవిత విశేషాలతో రూపొందించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన భారతీయ జోడి?
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ
ఎక్కడ : అడిలైడ్, ఆస్ట్రేలియా
ఎందుకు : డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించినందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్