Skip to main content

Ranji Trophy Champions: తొలిసారి రంజీ టైటిల్ నెగ్గిన మధ్యప్రదేశ్‌

Ranji Trophy: Madhya Pradesh create history
Ranji Trophy: Madhya Pradesh create history

కర్టాటర రాజధాని బెంగళూరులో జరిగిన రంజీ ట్రోఫీ - 2022 ఫైనల్లో ముంబైని ఓడించి మధ్య ప్రదేశ్ టైటిల్ గెలుచుకుంది.  41 సార్లు ట్రోఫీ సాధించిన ఘన చరిత్ర ఉన్న ముంబై జట్టుని ఓడించి.. రంజీ చరిత్రలో తొలిసారి కప్ గెలుచుకుంది. ఆఖరి రోజు దాకా సాగిన ఈ పోరులో మధ్యప్రదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ ముంబైని ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 113/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 57.3 ఓవర్లలో 269 పరుగుల వద్ద ఆలౌటై మధ్యప్రదేశ్‌జట్టుకు 108 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్స్‌లో అర్మాన్‌ జాఫర్‌ (37) క్రితంరోజు స్కోరుకు మరో 7 పరుగులే జతచేసి అవుటయ్యాడు. సువేద్‌ పార్కర్‌ (51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత వచ్చిన వారిలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ సర్ఫరాజ్‌ ఖాన్‌ (45; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. కుమార్‌ కార్తీకేయ 4 వికెట్లు తీశాడు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 29.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హిమాన్షు మంత్రి (37; 3 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ శుభమ్‌ శర్మ (30; 1 ఫోర్, 1 సిక్స్‌), రజత్‌ పటిదార్‌ (30 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించారు. షమ్స్‌ ములానికి 3 వికెట్లు దక్కాయి. 

Also read: World Archery Championship: ప్రపంచ ఆర్చరీలో ఏపీ అర్చర్ సురేఖకు స్వర్ణం

Published date : 27 Jun 2022 05:17PM

Photo Stories