Open Athletics Championship: స్టీపుల్‌చేజ్‌లో పసిడి పతకం సాధించిన రైల్వేస్ అథ్లెట్?
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ అథ్లెట్ పారుల్ చౌదరి పసిడి పతకం సాధించింది. పోటీల్లో భాగంగా హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 17న జరిగిన మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్ ఫైనల్లో పారుల్ అందరికంటే ముందుగా(9ని.51.01 సె) గమ్యాన్ని చేరి విజేతగా నిలవడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్ర అథ్లెట్ కోమల్ చంద్రకాంత్ జగ్దలే 9 ని.51.03సెకన్ల టైమింగ్‌తో రజతంతో సరిపెట్టుకొంది. ఈ ఈవెంట్‌లో ప్రీతి (రైల్వేస్; 10 ని.22.45 సె.) కాంస్యం గెలిచింది.
5000 మీటర్ల పరుగులోనూ...
పోటీల ప్రారంభ రోజే పారుల్ 5000 మీటర్ల పరుగులో కూడా బంగారు పతకం సాధించింది. మరో ఐదు ఈవెంట్లలో రైల్వేస్ అథ్లెట్లు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో సందేశ్, షాట్‌పుట్‌లో కరణ్‌వీర్ సింగ్, మహిళల లాంగ్‌జంప్‌లో ఐశ్వర్య, హర్డిల్స్‌లో కనిమొని స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.
జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శరత్...
జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శ్రీధరన్ శరత్ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్ మోహన్, రణదేవ్ బోస్, పథీక్ పటేల్, హర్వీందర్ సింగ్ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ 2022 ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగే అండర్19 ప్రపంచ కప్ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది.
చదవండి: ఎన్‌సీసీ కమిటీలో సభ్యుడిగా నియమితులైన క్రికెట్ దిగ్గజం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 3000 మీ. స్టీపుల్‌చేజ్ పసిడి పతకం సాధించిన రైల్వేస్ అథ్లెట్?
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : పారుల్ చౌదరి
ఎక్కడ : జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, హన్మకొండ, హన్మకొండ జిల్లా