జాతీయ బిలియర్డ్స్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ (కర్ణాటక) మరోసారి మెరిశాడు.
pankaj advani
భోపాల్‌లో జరిగిన ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) జట్టు తరఫున బరిలోకి దిగిన పంకజ్ 5–2 ఫ్రేమ్‌ల తేడాతో ధ్రువ్ సిత్వాలాపై ఘనవిజయం సాధించాడు. పంకజ్ ఖాతాలో ఇది 11వ జాతీయ సీనియర్ బిలియర్డ్స్ టైటిల్ కాగా... ఓవరాల్‌గా అతని కెరీర్‌లో ఇది 68వ టైటిల్ కావడం విశేషం. ఈ 68 టైటిల్స్‌లో ప్రపంచ టైటిల్స్ 23...ఆసియా టైటిల్స్ 10... జాతీయ టైటిల్స్ 35 ఉన్నాయి.