Skip to main content

ICC T20 Rankings : అగ్రస్థానంలోనే భారత్

ప్రపంచ చాంపియన్‌ ఆ్రస్టేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తన టాప్‌ ర్యాంక్‌ను పటిష్టం చేసుకుంది.
Men's T20I Team Rankings
Men's T20I Team Rankings

సెప్టెంబర్ 26న విడుదల చేసిన టీమ్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ బృందం 268 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 261 పాయింట్లతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉండగా... 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలిస్తే రెండో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది.  252 పాయింట్లతో న్యూజిలాండ్‌ ఐదో స్థానంలో నిలిచింది. 250 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో ఉన్న ఆ్రస్టేలియా సొంతగడ్డపై ప్రపంచకప్‌నకు ముందు వెస్టిండీస్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. 

Also read: Women's cricket: ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్‌

Published date : 27 Sep 2022 06:32PM

Photo Stories