జులై 2017 అవార్డ్స్
Sakshi Education
బుకర్ ప్రైజ్ జాబితాలో అరుంధతీ రాయ్
ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్’ పుస్తకం మ్యాన్ బుకర్ ప్రైజ్ జాబితాలో చోటు సంపాదించింది. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రచురితమైన వాటిలో 13 పుస్తకాలు ఈ జాబితాకు ఎంపికయ్యాయి. ఐదుగురు జడ్జీలతో కూడిన ప్యానెల్ 144 పుస్తకాల నుంచి వీటిని ఎంపిక చేసింది. వీటిలో తుది జాబితాకు ఎంపికైన ఆరు పుస్తకాల వివరాలను సెప్టెంబర్ 13న వెల్లడిస్తుంది. బుకర్ ప్రైజ్ విజేతను అక్టోబర్ 17న ప్రకటిస్తుంది. విజేతకు రూ.41.5 లక్షల(50 వేల పౌండ్ల) మొత్తాన్ని బహుమతిగా అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 13 మందితో బుకర్ ప్రైజ్ జాబితా
ఎప్పుడు : జూలై 27
ఎవరు : రెండో సారి స్థానం పొందిన అరుంధతి రాయ్
ఎందుకు : ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్’ పుస్తకానికి గాను
రామన్ మెగసెసె అవార్డు - 2017
సమాజ సేవ, పర్యావరణ-సాంస్కృతిక పరిరక్షణ తదితర రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఐదుగురు 2017 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కళలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. ఆగస్టు 31న మనీలాలో జరిగే కార్యక్రమంలో వీరికి అవార్డును అందజేస్తారు. రామన్ మెగసెసే అవార్డు ఆసియాన్ నోబెల్‌గా ప్రసిద్ధి చెందింది.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే గౌరవార్థం ఈ అవార్డుని 1957లో ప్రారంభించారు.
2017 అవార్డు గ్రహీతలు
ఏమిటి : రామన్ మెగసెసె అవార్డు 2017 ప్రకటన
ఎప్పుడు : జూలై 31
ఎవరు : వివిధ దేశాలకు చెందిన ఆరుగురు అవార్డుకు ఎంపిక
ఎందుకు : వివిధ రంగాల్లో చేసిన విశేష కృషికి
గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్‌కు 2 అవార్డులు
అమెరికాలో నిర్వహించిన మొదటి గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్‌లో జూలై 19న ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఝంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం దక్కాయి.
ఐఫా అవార్డులు - 2017
18వ ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)-2017 అవార్డుల ప్రదానోత్సవం జూలై 16న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదరీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.
అవార్డులు
ఏమిటి : ఐఫా అవార్డులు - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
మంగళంపల్లి పేరిట రూ. 10 లక్షల అవార్డు
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను జూలై 6న నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట అవార్డు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : సంగీత విధ్వాంసులకి అందించేందుకు
మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
స్పోర్‌ట్స ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 7న ముంబైలో జరిగింది. ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ‘స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : పీవీ సింధు
కోచ్ ఆఫ్ ది ఇయర్ : పుల్లెల గోపీచంద్
టీమ్ ఆఫ్ ది ఇయర్ : పురుషుల జూనియర్ హాకీ జట్టు
లివింగ్ లెజెండ్ : మిల్కా సింగ్
గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ : లోకేశ్ రాహుల్
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ : అభినవ్ బింద్రా
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారుతీ సుజుకీ స్పోర్ట్స్ అవార్డ్స్ - 2017
ఎప్పుడు : జూలై 6
ఎవరు : స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్
ఎక్కడ : ముంబైలో
టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ పురస్కారాలు
అశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా బస్’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎక్సలెన్‌స ఇన్ బస్ ట్రాన్‌సపోర్టేషన్, ఎక్సలెన్‌స ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, టాప్ బస్ డ్రైవర్ అనే అంశాల్లో ఆర్టీసీ ఈ పురస్కారాలను పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా బస్ పురస్కారాలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : టీఎస్‌ఆర్టీసీకి 3 పురస్కారాలు
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఆచార్య ఇనాక్‌కు రావూరి స్మారక పురస్కారం
ప్రఖ్యాత కథకుడు, భాషా పరిశోధకుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 2017 సంవత్సరానికి డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రావూరి భరద్వాజ, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు రావూరి కోటేశ్వరరావు, సాయి సుమంత్ జూన్ 28న ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో జూలై 5వ తేదీన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఈ పురస్కారాన్ని ఇనాక్‌కు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రావూరి స్మారక పురస్కారం - 2017
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ఆచార్య కొలకలూరి ఇనాక్
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
ఇద్దరు భారతీయ అమెరికన్లకు 2017కిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.
బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : శంతను నారాయణ్, వివేక్ మూర్తి
ఎక్కడ : అమెరికాలో
దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు
వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథ రామిరెడ్డికి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును ప్రకటించింది. జూలై 1న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
వాణిజ్య రంగంలో చేసిన సేవలకు గాను గుంటూరుకు చెందిన జాస్తి రమేశ్‌కు ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్
ఎక్కడ : న్యూఢి ల్లీలో
ఎందుకు : వైద్య రంగంలో అందించిన సేవలకు గాను వార్తల్లో వ్యక్తులు
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి
1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముస్తఫా దోసా మృతి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : 1993 ముంబై పేలుళ్ల దోషి
ఎక్కడ : ముంబైలో
ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చుక్కా వెంకటయ్య కన్నుమూత
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో మాజీ డెరైక్టర్
ఎక్కడ : బెంగళూరులో
ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ
‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్‌లో
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్
నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన అటార్నీ జనరల్ నియామకం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేకే వేణుగోపాల్
ఎందుకు : ఇంతకముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పదవీకాలం జూన్ 18న ముగిసినందుకు
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి
21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎప్పుడు : జూలై 6
ఎవరు : అచల్ కుమార్ జ్యోతి
ఎందుకు : జూలై 6న పదవీ విరమణ చేసిన నసీం జైదీ
పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణ
భారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నంద
ఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

- యోషియాకి ఇషిజవా - జపాన్
- గెత్సీ షన్ముగమ్ - శ్రీలంక
- అబ్డాన్ నబాన్ - ఇండోనేషియా
- టోని టాయ్ - సింగపూర్
- లిలియా డీ లిమా - ఫిలిప్పీన్స్
- ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ - ఫిలిప్పీన్స్
ఏమిటి : రామన్ మెగసెసె అవార్డు 2017 ప్రకటన
ఎప్పుడు : జూలై 31
ఎవరు : వివిధ దేశాలకు చెందిన ఆరుగురు అవార్డుకు ఎంపిక
ఎందుకు : వివిధ రంగాల్లో చేసిన విశేష కృషికి
గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్‌కు 2 అవార్డులు
అమెరికాలో నిర్వహించిన మొదటి గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్‌లో జూలై 19న ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఝంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం దక్కాయి.
ఐఫా అవార్డులు - 2017
18వ ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)-2017 అవార్డుల ప్రదానోత్సవం జూలై 16న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదరీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.
అవార్డులు
- ఉత్తమ నటుడు: షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ నటి: అలియా భట్(ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ చిత్రం: నీర్జా
- ఉత్తమ నటుడు(కామిక్): వరుణ్ ధావన్(డిష్యూం)
- ఉత్తమ ప్రతినాయకుడు: జిమ్ సర్బ్(నీర్జా)
- ఉత్తమ నటి(తొలి పరిచయం): దిశా పటానీ(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ నటుడు (తొలి పరిచయం): దిల్జిత్ దొసాంజ్
- ఉత్తమ సహాయనటి: షబానా అజ్మీ(నీర్జా)
- ఉత్తమ సహాయనటుడు: అనుపమ్ ఖేర్(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ దర్శకుడు: అనిరుధ్ రాయ్ చౌదరి(పింక్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్(యే దిల్‌హై ముష్కిల్)
- ఉత్తమ గేయరచయిత: అమితాబ్ భట్టాచార్య
- ఉత్తమ గాయకుడు: అమిత్ మిశ్రా
- ఉత్తమ గాయని: తులసీ కుమార్
- స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్: అలియా భట్
- ఉమన్ ఆఫ్ ది ఇయర్: తాప్సి
ఏమిటి : ఐఫా అవార్డులు - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
మంగళంపల్లి పేరిట రూ. 10 లక్షల అవార్డు
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను జూలై 6న నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట అవార్డు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో
ఎందుకు : సంగీత విధ్వాంసులకి అందించేందుకు
మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
స్పోర్‌ట్స ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 7న ముంబైలో జరిగింది. ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ‘స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : పీవీ సింధు
కోచ్ ఆఫ్ ది ఇయర్ : పుల్లెల గోపీచంద్
టీమ్ ఆఫ్ ది ఇయర్ : పురుషుల జూనియర్ హాకీ జట్టు
లివింగ్ లెజెండ్ : మిల్కా సింగ్
గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ : లోకేశ్ రాహుల్
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ : అభినవ్ బింద్రా
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారుతీ సుజుకీ స్పోర్ట్స్ అవార్డ్స్ - 2017
ఎప్పుడు : జూలై 6
ఎవరు : స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్
ఎక్కడ : ముంబైలో
టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ పురస్కారాలు
అశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా బస్’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎక్సలెన్‌స ఇన్ బస్ ట్రాన్‌సపోర్టేషన్, ఎక్సలెన్‌స ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, టాప్ బస్ డ్రైవర్ అనే అంశాల్లో ఆర్టీసీ ఈ పురస్కారాలను పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా బస్ పురస్కారాలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : టీఎస్‌ఆర్టీసీకి 3 పురస్కారాలు
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఆచార్య ఇనాక్‌కు రావూరి స్మారక పురస్కారం
ప్రఖ్యాత కథకుడు, భాషా పరిశోధకుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 2017 సంవత్సరానికి డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రావూరి భరద్వాజ, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు రావూరి కోటేశ్వరరావు, సాయి సుమంత్ జూన్ 28న ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో జూలై 5వ తేదీన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఈ పురస్కారాన్ని ఇనాక్‌కు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రావూరి స్మారక పురస్కారం - 2017
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : ఆచార్య కొలకలూరి ఇనాక్
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
ఇద్దరు భారతీయ అమెరికన్లకు 2017కిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.
బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : శంతను నారాయణ్, వివేక్ మూర్తి
ఎక్కడ : అమెరికాలో
దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు
వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథ రామిరెడ్డికి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును ప్రకటించింది. జూలై 1న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
వాణిజ్య రంగంలో చేసిన సేవలకు గాను గుంటూరుకు చెందిన జాస్తి రమేశ్‌కు ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్
ఎక్కడ : న్యూఢి ల్లీలో
ఎందుకు : వైద్య రంగంలో అందించిన సేవలకు గాను వార్తల్లో వ్యక్తులు
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి
1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముస్తఫా దోసా మృతి
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : 1993 ముంబై పేలుళ్ల దోషి
ఎక్కడ : ముంబైలో
ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చుక్కా వెంకటయ్య కన్నుమూత
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ఇస్రో మాజీ డెరైక్టర్
ఎక్కడ : బెంగళూరులో
ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ
‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : జూలై 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రాష్ట్రపతి భవన్‌లో
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్
నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన అటార్నీ జనరల్ నియామకం
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : కేకే వేణుగోపాల్
ఎందుకు : ఇంతకముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పదవీకాలం జూన్ 18న ముగిసినందుకు
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి
21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎప్పుడు : జూలై 6
ఎవరు : అచల్ కుమార్ జ్యోతి
ఎందుకు : జూలై 6న పదవీ విరమణ చేసిన నసీం జైదీ
పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణ
భారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నంద
ఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
Published date : 22 Jul 2017 04:32PM