Ishan Kishan: క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగవ ఇండియన్ బ్యాటర్‌గా కీర్తికెక్కాడు. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడవ వన్డేల్లో అతను ఈ ఘనతను సాధించాడు. కిషన్ 126 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో డబుల్ సెంచరీ నమోదు చేసిన విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును కిషన్ బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా కిషన్ నిలిచాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో గేల్ 138 బంతుల్లో జింబాబ్వేపై డబుల్ సెంచరీ చేయగా.. బంగ్లాపై కిషన్ కేవలం 126 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్నాడు. గేల్ కన్నా 12 తక్కువ బాల్స్‌లోనే కిషన్ ఆ రికార్డును దాటేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యువ క్రికెటర్‌గా కూడా నిలిచాడు ఇషాన్ . ఇండియా తరపున గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు తమ ఖాతాల్లో డబుల్ సెంచరీ వేసుకున్నారు. ఇక వన్డే హిస్టరీలో డబుల్ సెంచరీ స్కోర్ చేసిన ఏడవ బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ . ఈ రికార్డును అందుకున్నవారిలో మార్టిన్ గప్తిల్, గేల్, ఫకర్ జమాన్ ఉన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP