Skip to main content

IPL 2022 : ఐపీఎల్‌ మెగా వేలంలో ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే..!

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందుగా వేలంలోకి వచ్చాడు.
ipl 2022 mega auction news
IPL 2022 Mega Auction

ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. ఇందుకోసం 5 కోట్లు ఖర్చు చేసింది. ఇక మిగిలిన మార్కీ ప్లేయర్లు ఎంత ధరకు అమ్ముడుపోయారో ఓ లుక్కేద్దాం.

టాప్‌- 10లో వీరే..
1.శిఖర్‌ ధావన్‌: రూ. 8.25 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌
2.రవిచంద్రన్‌ అశ్విన్‌: 5 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌
3.ప్యాట్‌ కమిన్స్‌: 7.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌
4.కగిసో రబడ: 9.25 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌
5.ట్రెంట్‌ బౌల్ట్‌: 8 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌
6. శ్రేయస్‌ అయ్యర్‌: 12.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్‌
7. మహ్మద్‌ షమీ : 6.25 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌
8. ఫాఫ్‌ డుప్లెసిస్‌ : 7 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)
9. క్వింటన్‌ డికాక్‌ : 6.75 కోట్లు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
10. డేవిడ్‌ వార్నర్‌ : 6.25 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌

Published date : 12 Feb 2022 02:54PM

Photo Stories