Skip to main content

Asian Wrestling Championships: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమన్‌కు స్వర్ణం

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఎట్టకేలకు భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది.
Aman Sehrawat

ఈ టోర్నీ ఐదో రోజు ఏప్రిల్ 13న‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగంలో అమన్‌ సెహ్రావత్‌ భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఫైనల్లో అమన్‌ 9–4 పాయింట్ల తేడాతో అల్మాజ్‌ సమన్‌బెకోవ్‌ (కిర్గిస్తాన్‌)పై గెలుపొందాడు. నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్‌ ఆడిన అమన్‌ 7–1తో రికుటో అరాయ్‌ (జపాన్‌)పై, సెమీఫైనల్లో 7–4తో వాన్‌హావో జు (చైనా)పై విజయం సాధించాడు. అమన్‌ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఏడాది 57 కేజీల విభాగంలో భారత్‌ ఖాతాలోనే స్వర్ణ పతకం చేరడం విశేషం. 2020, 2021, 2022లలో రవి కుమార్‌ దహియా ఈ విభాగంలో విజేతగా నిలిచాడు. గాయం కారణంగా ఈసారి రవి ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఢిల్లీలోని విఖ్యాత ఛత్రశాల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసే అమన్‌ గత ఏడాది అండర్‌–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది అమన్‌కిది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్‌ ఓపెన్‌ ర్యాంకింగ్ టోర్నీలో అమన్‌ కాంస్య పతకం గెలిచాడు. 

Asian Wrestling Championships 2023: భారత రెజ్లర్లకు ఐదు పతకాలు

ఏప్రిల్ 13న జరిగిన ఇతర నాలుగు వెయిట్‌ కేటగిరీల్లో మూడింట భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. 79 కేజీల విభాగంలో దీపక్‌ కుక్నా కాంస్య పతకం నెగ్గగా.. 97 కేజీల విభాగంలో దీపక్‌ నెహ్రా కాంస్య పతక బౌట్‌లో ఓడిపోయాడు. దీపక్‌ కుక్నా 12–1తో షురాత్‌ బొజొరోవ్‌ (తజికిస్తాన్‌)పై గెలుపొందగా.. దీపక్‌ నెహ్రా 9–12తో మక్సూద్‌ వెసలోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అనూజ్‌ (65 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో, ములాయం యాదవ్‌ (70 కేజీలు) క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఓటమి పాలయ్యారు. 

FIFA Rankings: ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అర్జెంటీనా

Published date : 14 Apr 2023 04:13PM

Photo Stories