ICC Test Rankings: టీమిండియా అగ్రస్థానం..తర్వాత స్థానాల్లో..
Sakshi Education
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
124 పాయింట్లతో కివీస్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. ఇక రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ రెండో ర్యాంకుకు పడిపోయింది. ఇక ఇండియా, కివీస్(121) తర్వాత ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్(107), పాకిస్తాన్(92 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.
Published date : 06 Dec 2021 07:24PM