ISSF World Cup Baku 2023: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో రజతాలు నెగ్గిన హృదయ్, నాన్సీ
Sakshi Education
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి.
మే 12న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత షూటర్ హృదయ్ హజారికా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో నాన్సీ రజత పతకాలు సాధించారు. ఫైనల్లో హృదయ్ 251.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. హరియాణకు చెందిన 19 ఏళ్ల నాన్సీ ఫైనల్లో నాన్సీ 253.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలతో రెండో స్థానంలో ఉంది.
Archery World Cup: డిప్యూటీ కలెక్టర్, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
Published date : 13 May 2023 12:13PM