Former Indian Cricketer: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్?
భారత క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. రవిశాస్త్రి అనంతరం టీమ్ హెడ్ కోచ్ బాధ్యతలను ద్రవిడ్‌కు అప్పగిస్తూ సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్‌లతో కూడిన బీసీసీఐ సలహా కమిటీ నవంబర్ 3న నిర్ణయం తీసుకుంది. 2021, నవంబర్ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే టి20 సిరీస్ నుంచి ద్రవిడ్ కోచ్ హోదాలో కొనసాగనున్నాడు. భారత్‌లో జరిగే 2023 వన్డే వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉంటాడు. గతంలో ద్రవిడ్ శిక్షణలో భారత అండర్–19 జట్టు రెండుసార్లు అండర్–19 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత క్రికెట్ జట్టు తదుపరి హెడ్ కోచ్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్
ఎందుకు : టి20 ప్రపంచకప్–2021 ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో...
చదవండి: ఖేల్‌రత్న అవార్డును ఎంతమందికి ప్రదానం చేయనున్నారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్