Sourav Ganguly : ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త బాస్‌గా గంగూలీ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా సుదీర్ఘకాలంలో ఈ పదవిలో కొనసాగుతున్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో ఐసీసీ ఈ మేరకు అతడి స్థానాన్ని గంగూలీతో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ నవంబర్ 17వ తేదీన పత్రికా ప్రకటన విడుదల చేసింది.
క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు
టీమిండియా సారథిగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీకి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా ఆటగాడిగానే కాకుండా... క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా తొలుత సేవలు అందించిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలు అందించనున్నాడు.