Football Durand Cup: విజేతగా బెంగళూరు FC
Sakshi Education
భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది.
సెప్టెంబర్ 18న జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది. బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.
Also read: SAFF U17 Championships: ‘శాఫ్’ ఫుట్‌బాల్ చాంప్ భారత్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Sep 2022 06:58PM