2022 World Wrestling Championships: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో పతకం సాధించిన భారత రెజ్లర్
Sakshi Education
బెల్‌గ్రేడ్ (సెర్బియా): సెప్టెంబర్ 18న ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు.
కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్‌లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. సెప్టెంబర్ 18న జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్‌లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్‌జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు.
ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు.
Published date : 19 Sep 2022 06:56PM