Sulphur on Moon: చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ నిల్వలు నిజమే
Sakshi Education
అత్యంత విలువైన సల్ఫర్ నిల్వలు చందమామ ఉపరితలంపై ఉన్నట్లు చంద్రయాన్–3 మిషన్ ఇప్పటికే గుర్తించింది.
అయితే, ఈ విషయాన్ని మరో విభిన్నమైన పరీక్ష ద్వారా రోవర్ ప్రజ్ఞాన్ మరోసారి నిర్ధారించింది. రోవర్‌లోని అల్ఫా పార్టికల్ ఎక్స్–రే స్పెక్ట్రోస్కోప్(ఏపీఎక్స్‌ఎస్) సల్ఫర్‌ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది.
High temperature on Moon: చంద్రుడిపై అధిక ఉష్ణోగ్రతలు
అంతేకాకుండా మరికొన్ని చిన్నపాటి మూలకాలను కనిపెట్టిందని తెలియజేసింది. అయితే, చంద్రుడి మట్టిలోకి సల్ఫర్ ఎలా వచ్చిందన్నది కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది. అగ్ని పర్వతం పేలడం వల్ల ఏర్పడిందా? లేక గ్రహశకలాల ద్వారా వచ్చిందా? అన్నది సైంటిస్టులు తేల్చాలని వెల్లడించింది.
Published date : 01 Sep 2023 01:13PM