Skip to main content

Artificial Pancreas: టైప్‌–2 మధుమేహులకు శుభవార్త‌.. ఒంట్లో చక్కెర మోతాదుని నియంత్రించే.. కృత్రిమ క్లోమం

టైప్‌–2 మధుమేహులకు ఇది నిజంగా శుభవార్త‌. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.

భారత్‌లోనైతే 2019 నాటికి ఏకంగా 7.7 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 2045 కల్లా వీరి సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఒంట్లో చక్కెర మోతాదులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేందుకు దోహదపడే కృత్రిమ క్లోమాన్ని కేంబ్రిడ్జి వర్సిటీలోని వెల్‌కమ్‌–ఎంఆర్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటబాలిక్‌ సైన్స్‌ పరిశోధకులు తాజాగా అభిృవృద్ధి చేశారు. దీన్నిప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు. టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది వరప్రసాదమేనని వారు చెబుతున్నారు. కామ్‌ఏపీఎస్‌ హెచ్‌ఎక్స్‌గా పిలిచే దీంట్లో గ్లూకోజ్‌ మానిటర్, ఇన్సులిన్‌ పంపు ఉంటాయి. ఇది యాప్‌ సాయంతో పని చేస్తుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

చక్కెర స్థాయి సరైన విధంగా కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఇన్సులిన్‌ అవసరమో అంచనా వేసి చెబుతుంది. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తదితరాలతో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను సరిగా మెయింటెయిన్‌ చేయడం టైప్‌ 2 డయాబెటిస్‌ రోగుల్లో చాలామందికి సమస్యగా మారింది. అలాంటి వారికి ఈ కృత్రిమ క్లోమం సురక్షితమైన, మెరుగైన ప్రత్యామ్నాయం. దీని టెక్నాలజీ చాలా సులువైనది. కనుక ఇంట్లో సురక్షితంగా వాడుకోవచ్చు’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన చార్లొటీ బౌటన్‌ తెలిపారు. దీని వివరాలు జర్నల్‌ నేచర్‌ మెడిసిన్‌లో పబ్లిషయ్యాయి. 

Heart Diseas: నడకతో గుండె పదిలం..!

ఇలా చేశారు..  
కామ్‌ఏపీఎస్‌ హెచ్‌ఎక్స్‌ను తొలుత 26 మంది టైప్‌–2 డయాబెటిస్‌ రోగులపై ప్రయోగాత్మకంగా వాడి చూశారు. వీరిని రెండు గ్రూపులుగా చేశారు. తొలి గ్రూపు 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని వాడి తర్వాత రోజువారీ ఇన్సులిన్‌ ఇంజక్షన్ల వంటి పద్ధతులకు మారింది. రెండో గ్రూప్‌ ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా తొలుత రోజువారీ ఇన్సులిన్‌ ఇంజక్షన్ల వంటివి వాడి అనంతరం 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని ఉపయోగించింది. రెండు గ్రూపుల్లోనూ కృత్రిమ క్లోమాన్ని వాడినప్పుడు రోగుల్లో సగటు చక్కెర స్థాయిలు 3 ఎంఎంఓఎల్‌/ఎల్‌ మేరకు పడిపోయినట్టు గుర్తించారు. అంతేగాక రక్తంలో హిమోగ్లోబిన్‌ చక్కెరతో కలిసినప్పుడు వృద్ధి చెందే గ్లైకేటెడ్‌ హిమోగ్లోబిన్‌ (హెచ్‌బీఏ1సీ) అణువుల మోతాదు కూడా తగ్గినట్లు తేలింది. 
ఇన్సులిన్‌ ఇంజక్షన్లతో నానా రకాల సైడ్‌ ఎఫెక్టులున్న నేపథ్యంలో కృత్రిమ క్లోమం చాలా మెరుగైన ప్రత్యామ్నాయం కాగలదని కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్‌ ఐదీన్‌ డాలీ అభిప్రాయపడ్డారు. వాణిజ్యపరంగా రోగులకు దీన్ని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చే ముందు మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

Risk Of Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్‌

Published date : 18 Jan 2023 11:59AM

Photo Stories