DART Mission Successful: గ్రహశకలం కక్ష్యను మార్చిన డార్ట్
Sakshi Education
గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పును నివారించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన 'డబుల్ ఆస్ట్రాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్(డార్ట్(డీఏఆర్‌టీ))' మిషన్ ప్రయోగం విజయవంతమైంది. గత నెల 26న డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో.. డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. డార్ట్ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ప్రకటించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Oct 2022 06:25PM