Skip to main content

Indian Institute of Science ‘snapping’ sandals can prevent diabetic foot : మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్‌ చెప్పులు

Indian Institute of Science snapping sandals can prevent diabetic foot

మధుమేహ(డయాబెటిస్‌) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్‌ ఆఫ్‌మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ రిసెర్చ్‌(కేఐఈఆర్‌) తగిన సహకారం అందించింది. డయాబెటిస్‌ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్‌ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు. 

Published date : 14 Jun 2022 04:56PM

Photo Stories