Skip to main content

DRDO: భారత అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం

Indian DRDO test-fires Agni 5 missile   Successful test of Agni 5 missile by India's Defense Research Organization   First launch of Agni 5 missile was successful   Agni 5 missile in flight during test by DRDO

భారత అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం చేరింది. ‘మిషన్‌దివ్యాస్త్ర’ పేరుతో ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణిని భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) మార్చి 11న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ క్షిపణిని మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికిల్‌(ఎంఐఆర్‌వీ) టెక్నాలజీతో డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. అగ్ని 5 క్షిపణి తొలి ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. తాజా ప్రయోగంతో ఎంఐఆర్‌వీ సాంకేతికత కలిగిన అగ్రదేశాల సరసన భారత్‌ చేరింది. ఈ ప్రాజెక్టు హెడ్‌ ఒక మహిళ అని, ఇందులో అనేక మంది మహిళలు కీలకపాత్ర పోషించారని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Mar 2024 04:31PM

Photo Stories