Drishti 10 Adani Group Made In India Surveillance Drone- భారత్ మొట్టమొదటి మానవ రహిత విమానం
భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ టెక్నాలజీతో దేశీయంగా తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’డ్రోన్‌ను బుధవారం నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆవిష్కరించారు.హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో ఈ వేడుక నిర్వహించారు.
యూఏవీ రంగంలో కీలక ముందడుగు
ఈ సందర్భంగా నేవీ చీఫ్ అడ్మిరల్ మాట్లాడుతూ..యూఏవీ రంగంలో భారత్‌కు ఇది కీలక ముందడుగు అని, నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవ రహిత విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించామని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్, నిఘా కార్యకలాపాల్లో దేశ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు.
దృష్టి డ్రోన్.. ప్రత్యేకతలు ఇవే
అదానీ గ్రూప్ తయారు చేసిన ఈ దృష్టి డ్రోన్ ప్రత్యేకతలను ఓసారి పరిశీలిస్తే.. ఇది గాల్లో 36 గంటల పాటు ఎగరగలదు. అంతేకాకుండా 450 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. సముద్ర జలాలపై వాతావరణ మార్పులను తట్టుకుంటూ, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసేలా అదానీ గ్రూప్ ఈ డ్రోన్‌ను తయారు చేశారు.
కాగా ఇప్పటికే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇప్పటికే అనేక ఆయుధాలు, మానవరహిత వైమానిక విమానాలు, రాడార్లు వంటివి ఉత్తత్పి చేస్తోంది. ఇప్పుడు సముద్రంలో నిఘూ వ్యవహారాల కోసం దేశీయంగా దృష్టి డ్రోన్‌ను డిజైన్ చేశారు.