Chinese Space Craft: మార్స్ గ్రహం సౌత్ పోల్‌ని తాకిన చైనా
Sakshi Education
మానవ రహిత చైనీస్ స్పేస్‌క్రాఫ్ట్.. మార్స్ గ్రహంపై అద్భుతాలు నమోదు చేసింది. గతేడాది ప్రారంభం నుంచి అంగారక గ్రహం చుట్టూ ఇది 1,300 కంటే ఎక్కువసార్లు ప్రదక్షిణ చేసిందని.. ఆ తర్వాత అంగారకుని దక్షిణ ధ్రువం దృశ్యాలతో సహా మార్స్ మొత్తాన్ని కవర్ చేసే చిత్రాల డేటాను పొందిందని చైనా జాతీయ మీడియా వెల్లడించింది. చైనాకు చెందిన టియాన్ వెన్–1.. ఫిబ్రవరి 2021లో రెడ్ ప్లానెట్‌ను విజయవంతంగా చేరుకుంది. 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించిన ఆర్బిటింగ్ ప్రోబ్..అంగారకగ్రహం దక్షిణ ధ్రువంలోని మంచు కింద నీటిని కనుగొన్న విషయం తెలిసిందే. భూగర్భ జలాలను గుర్తించడం అనేది గ్రహం జీవ సంభావ్యతను గుర్తించడంలో కీలకం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 16 Jul 2022 06:25PM