Skip to main content

Space: 2022లో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపనున్న దేశం?

Space

2022 సంవత్సరం 50కి పైగా స్పేస్‌ లాంచ్‌లు జరపాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతోపాటు తన స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆరు సార్లు మానవ సహిత అంతరిక్ష యాత్రలు సైతం 2022 ఏడాది చైనా చేపట్టనుంది. నూతన సంవత్సరం అంతరిక్షంపై పట్టుకు రూపొందించుకున్న విధానాలను చైనా ఫిబ్రవరి 10న ప్రకటించింది. 2022 సంవత్సరం 50కిపైగా స్పేస్‌ లాంచ్‌లతో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపుతామని వెల్లడించింది.

ఐఎస్‌ఎస్‌కు పోటీగా..

2021లో ప్రపంచమంతా కలిసి 146 స్పేస్‌ లాంచింగ్‌లు జరిగాయి. వీటిలో 48 లాంచింగ్‌లు చైనా చేపట్టినవే. 2021 ఏడాది 51 లాంచింగ్‌లతో యూఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైనా స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణంలో ముగ్గురు వ్యోమోగాములు పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కు పోటీగా చైనా ఈ సీఎస్‌ఎస్‌ (చైనా అంతరిక్ష కేంద్రం)ను నిర్మిస్తోంది.

చ‌ద‌వండి: సౌర తుఫాన్ల కారణంగా ఏ సంస్థ శాటిలైట్లు కాలిపోయాయి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022లో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపనున్న దేశం?
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు    : చైనా
ఎందుకు : అంతరిక్షంపై పట్టు సాధించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 12:19PM

Photo Stories