Skip to main content

TS: టీఆర్‌ఎస్‌ .. ఇక బీఆర్‌ఎస్‌!.. పేరు మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
TRS state body passes resolution to change name to BRS
TRS state body passes resolution to change name to BRS

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అక్టోబర్ 5న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనరల్‌ బాడీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం అమోదించింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశాం..’ అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనకు జనరల్‌ బాడీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు. కాగా పార్టీ నిర్ణయాన్ని తెలియచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ లేఖ రాశారు. ‘టీఆర్‌ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్‌ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణ అంశాలను సమర్పిస్తున్నాం..’ అని లేఖలో పేర్కొన్నారు.

Also read: Quiz of The Day (October 07, 2022): మలేరియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావాన్ని చూపుతుంది?

ఢిల్లీ సర్దార్‌ పటేల్‌ రోడ్డులో కార్యాలయం
ఢిల్లీ కౌటిల్యమార్గ్‌ సమీపంలోని సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో ఉన్న రాజకుటుంబీలకు చెందిన ఓ భవనంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: BCCI టైటిల్ స్పాన్సర్‌గా Paytm స్థానంలో ఏ కంపెనీ వచ్చింది?

 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Oct 2022 06:15PM

Photo Stories