ఫిబ్రవరి 2021 రాష్ట్రీయం
Sakshi Education
ఏపీలో ప్రభుత్వ స్టేట్ డేటా సెంటర్‌లు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి?
సైబర్ సెక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అంతర్వేదిలో ముఖ్యమంత్రి...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2020, సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : త్వరలో ప్రభుత్వ స్టేట్ డేటా సెంటర్‌లు ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, కడప
ఎందుకు : సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు
సైబరాబాద్ కమిషనరేట్‌లో...
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్ డెస్క్‌ను ఫిబ్రవరి 19న కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు.
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు విషయమై ఫిబ్రవరి 22న కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
ఏమిటి : తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం
బయో ఏషియా–2021 సదస్సు థీమ్ ఏమిటి?
కోవిడ్–19 ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22న 18వ బయో ఆసియా సదస్సు–2021 ప్రారంభమైంది. కరోనా కారణంగా వివిధ దేశాల ప్రతినిధులు వర్చువల్ విధానం ద్వారా సదస్సులో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 23 వరకు జరిగే ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లైఫ్ సెన్సైస్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాల గురించి మంత్రి వివరించారు.
బయో ఏషియా–2021 సదస్సు థీమ్: మూవ్ ది నీడిల్
ముఖ్యాంశాలు...
బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు 2021 ఏడాది భారత్ బయోటెక్‌కు దక్కింది. అవార్డును భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్ అందించారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయో ఏషియా–2021 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : లైఫ్ సెన్సైస్ రంగానికి ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు
ఈబీసీ నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న సమావేశమైన మంత్రివర్గం ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించనున్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు...
ఏమిటి : ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించేందుకు
ప్రాజెక్ట్ ఇండి వికీతో ఏ రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుంది?
ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే ‘వికీపీడియా’లో ఇంగ్లిషులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రిపుల్ ఐటీల భాగస్వామ్యంతో కేంద్ర ఐటీ శాఖ ‘‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’’ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కూడా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... వివిధ భాషల్లో సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ, తెలంగాణ ఐటీ శాఖ కలిసి పనిచేయనున్నాయి.
మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ వికీ వ్యాసాల్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాల్లోని సమాచారాన్నీ తెలుగులో అందుబాటులోకి తెస్తారు. వికీపీడియాలో లక్షల కొద్ది పేజీల సమాచారం అందుబాటులో ఉండగా, హిందీలో 1.34 లక్షల పేజీలు, తెలుగులో సుమారు 70 వేల పేజీల సమాచారం మాత్రమే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రాజెక్ట్ ఇండి వికీతో ఏ రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుంది?
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ
ఎందుకు : వివిధ భాషల్లో సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో అందుబాటులో తెచ్చేందుకు
ఏ జిల్లాలోని బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది?
వైఎస్సార్ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి 22 లక్షల మెట్రిక్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇ–టెండర్ కమ్ ఇ–వేలం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఏడాదిలో 10 లక్షల టన్నుల ఎ–గ్రేడ్, 2 లక్షల టన్నుల బి–గ్రేడ్, 10 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించనున్నట్లు ఫిబ్రవరి 7న ఏపీఎండీసీ తెలిపింది.
బెరైటీస్
1992 నాటికి 5,08,000 టన్నుల బెరైటీస్ ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. బెరైటీస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలు, రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతాల్లో లభిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎక్కడ : వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత్ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు?
సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లా మదనపల్లె వచ్చారు. మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్‌లో ‘‘భారత్ యోగా విద్యాకేంద్రం’’ను ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన పీపుల్స్ గ్రోవ్ స్కూల్‌ను సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ యోగా విద్యాకేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : సత్సంగ్ ఫౌండేషన్, మదనపల్లె, చిత్తూరు జిల్లా
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ఈడబ్ల్యూఎస్ కోటాతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగాయి.
ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీలు) మినహా ఆర్థి కంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ
ఎందుకు : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం
తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్ ప్రాజెక్టు ఉద్దేశం?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో ‘భారత్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం’ అనే అంశంపై జనవరి 29న జరిగిన వర్చువల్ సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ‘‘తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్’’ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళిక...
నాబార్డు ఆధ్వర్యంలో జనవరి 29న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి 2021–22 సంవత్సరానికి రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించారు. ‘స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22’ను విడుదల చేశారు. రైతులకు మౌలిక వసతులు పెంచేందుకు, అధిక పెట్టుబడి అందించడంతో పాటు వారి ఆదాయం పెరిగేలా నాబార్డు, బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం
ఎప్పుడు: జనవరి 29
ఎవరు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎందుకు: తెలంగాణలో ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు
ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చుతున్న ప్రాజెక్టు?
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే క్రస్ట్ గేట్ల నిర్వహణలో అత్యంత కీలకమైన 96 ‘హైడ్రాలిక్ హాయిస్ట్’ సిలిండర్లను జర్మనీలోని మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే 70 సిలిండర్లు జర్మనీ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేర్చారు. ప్రపంచంలో హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఏ పథకం కింద గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వదేశీ దర్శన్’’ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ కోట పునరుద్ధరణ కోసం రూ.3.92 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు ఐటీడీఏ ద్వారా మంజూరవుతుండగా, రాష్ట్ర టూరిజం శాఖ పనులను చేపడుతోంది. గోండురాజుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే శిల్ప, హస్త కళాకారులు తయారు చేసిన వాటిని ప్రదర్శనగా ఉంచేందుకు మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో...
భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా... మరియా గోండ్లు, కొండ మరియలు, భిషోహార్ మరియలు అనే మూడు రకాలున్నాయి. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండులకు పుట్టినిల్లు. తెలంగాణలో ఉన్న గోండులను ప్రధానంగా రాజగోండులు అని అంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గోండురాజుల కోట పునరుద్ధరణకు చర్యలు
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న
ఎందుకు: స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా

- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్ ఉంటుంది.
- రెండు దశల్లో నిర్మించే ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుంది. అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
- సంగారెడ్డి నుంచి తూప్రాన్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించింది.
- చౌటుప్పల్–షాద్‌నగర్ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్ కేటాయించాలి.
- రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయి.
ఏమిటి : తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం
బయో ఏషియా–2021 సదస్సు థీమ్ ఏమిటి?
కోవిడ్–19 ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22న 18వ బయో ఆసియా సదస్సు–2021 ప్రారంభమైంది. కరోనా కారణంగా వివిధ దేశాల ప్రతినిధులు వర్చువల్ విధానం ద్వారా సదస్సులో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 23 వరకు జరిగే ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. లైఫ్ సెన్సైస్ రంగానికి తెలంగాణలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాల గురించి మంత్రి వివరించారు.
బయో ఏషియా–2021 సదస్సు థీమ్: మూవ్ ది నీడిల్
ముఖ్యాంశాలు...
- 18వ బయో ఏషియా వార్షిక సదస్సు ఎజెండా కోవిడ్– 19 కేంద్రంగా ఉంది.
- తెలంగాణ రాష్ట్ర లైఫ్ సెన్సైస్ సలహామండలి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
- ప్రస్తుతం బయో ఏషియా సీఈఓగా శక్తి నాగప్పన్ ఉన్నారు.
- సుమారు 50 దేశాలకు చెందిన 1500 మంది నిపుణులు సదస్సులో పాల్గొంటున్నారు.
- కరోనా నేపథ్యంలో సదస్సును తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు.
బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు 2021 ఏడాది భారత్ బయోటెక్‌కు దక్కింది. అవార్డును భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్ అందించారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బయో ఏషియా–2021 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : లైఫ్ సెన్సైస్ రంగానికి ఉన్న అవకాశాలు, సవాళ్లు, పరిష్కారాలను చర్చించేందుకు
ఈబీసీ నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం
ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న సమావేశమైన మంత్రివర్గం ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించనున్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు...
- సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌కు ఆమోదం. 2021, ఏప్రిల్, 2022 మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలల ఖరారు.
- రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం.
- రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు –1974 సవరణకు ఆమోదం.
ఏమిటి : ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించేందుకు
ప్రాజెక్ట్ ఇండి వికీతో ఏ రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుంది?
ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనే ‘వికీపీడియా’లో ఇంగ్లిషులో అందుబాటులో ఉన్న సమాచారాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రిపుల్ ఐటీల భాగస్వామ్యంతో కేంద్ర ఐటీ శాఖ ‘‘ఇండిక్ వికీ ప్రాజెక్టు’’ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కూడా భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... వివిధ భాషల్లో సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ, తెలంగాణ ఐటీ శాఖ కలిసి పనిచేయనున్నాయి.
మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ వికీ వ్యాసాల్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ ప్రచురించిన పుస్తకాల్లోని సమాచారాన్నీ తెలుగులో అందుబాటులోకి తెస్తారు. వికీపీడియాలో లక్షల కొద్ది పేజీల సమాచారం అందుబాటులో ఉండగా, హిందీలో 1.34 లక్షల పేజీలు, తెలుగులో సుమారు 70 వేల పేజీల సమాచారం మాత్రమే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రాజెక్ట్ ఇండి వికీతో ఏ రాష్ట్ర ఐటీ శాఖ ఒప్పందం చేసుకుంది?
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ
ఎందుకు : వివిధ భాషల్లో సమాచారాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగు వికీపీడియాలో అందుబాటులో తెచ్చేందుకు
ఏ జిల్లాలోని బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది?
వైఎస్సార్ కడప జిల్లా మంగంపేట గనుల నుంచి 22 లక్షల మెట్రిక్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఇ–టెండర్ కమ్ ఇ–వేలం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. ఏడాదిలో 10 లక్షల టన్నుల ఎ–గ్రేడ్, 2 లక్షల టన్నుల బి–గ్రేడ్, 10 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించనున్నట్లు ఫిబ్రవరి 7న ఏపీఎండీసీ తెలిపింది.
బెరైటీస్
1992 నాటికి 5,08,000 టన్నుల బెరైటీస్ ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రం కూడా ఇదే. రంగులు, కాగితం, వస్త్రాలు, తోళ్ల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. బెరైటీస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలు, రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతాల్లో లభిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెరైటీస్ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎక్కడ : వైఎస్సార్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత్ యోగా విద్యాకేంద్రాన్ని రాష్ట్రపతి ఏ జిల్లాలో ప్రారంభించారు?
సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లా మదనపల్లె వచ్చారు. మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్‌లో ‘‘భారత్ యోగా విద్యాకేంద్రం’’ను ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన పీపుల్స్ గ్రోవ్ స్కూల్‌ను సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ యోగా విద్యాకేంద్రం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : సత్సంగ్ ఫౌండేషన్, మదనపల్లె, చిత్తూరు జిల్లా
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తాజాగా ఈడబ్ల్యూఎస్ కోటాతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి పెరిగాయి.
ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు(ఓబీసీలు) మినహా ఆర్థి కంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ
ఎందుకు : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం
తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్ ప్రాజెక్టు ఉద్దేశం?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో ‘భారత్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం’ అనే అంశంపై జనవరి 29న జరిగిన వర్చువల్ సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ‘‘తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్’’ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళిక...
నాబార్డు ఆధ్వర్యంలో జనవరి 29న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి 2021–22 సంవత్సరానికి రూ.1,35,780.33 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించారు. ‘స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22’ను విడుదల చేశారు. రైతులకు మౌలిక వసతులు పెంచేందుకు, అధిక పెట్టుబడి అందించడంతో పాటు వారి ఆదాయం పెరిగేలా నాబార్డు, బ్యాంకులు మరిన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ ఫైబర్(టీ ఫైబర్) గ్రిడ్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం
ఎప్పుడు: జనవరి 29
ఎవరు: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎందుకు: తెలంగాణలో ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు
ప్రపంచంలో అతిపెద్ద హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చుతున్న ప్రాజెక్టు?
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే క్రస్ట్ గేట్ల నిర్వహణలో అత్యంత కీలకమైన 96 ‘హైడ్రాలిక్ హాయిస్ట్’ సిలిండర్లను జర్మనీలోని మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే 70 సిలిండర్లు జర్మనీ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేర్చారు. ప్రపంచంలో హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లతో అతిపెద్ద గేట్లను అమర్చుతున్న ప్రాజెక్టు పోలవరమే. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఏ పథకం కింద గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వదేశీ దర్శన్’’ పథకం కింద ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న గోండురాజుల కోటను పునరుద్ధరించనున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ కోట పునరుద్ధరణ కోసం రూ.3.92 కోట్లతో పనులు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు ఐటీడీఏ ద్వారా మంజూరవుతుండగా, రాష్ట్ర టూరిజం శాఖ పనులను చేపడుతోంది. గోండురాజుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే శిల్ప, హస్త కళాకారులు తయారు చేసిన వాటిని ప్రదర్శనగా ఉంచేందుకు మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో...
భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా... మరియా గోండ్లు, కొండ మరియలు, భిషోహార్ మరియలు అనే మూడు రకాలున్నాయి. చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండులకు పుట్టినిల్లు. తెలంగాణలో ఉన్న గోండులను ప్రధానంగా రాజగోండులు అని అంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గోండురాజుల కోట పునరుద్ధరణకు చర్యలు
ఎప్పుడు: ఫిబ్రవరి 3
ఎవరు: భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఉన్న
ఎందుకు: స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా
Published date : 11 Mar 2021 12:29PM