ఫిబ్రవరి 2017 రాష్ట్రీయం
Sakshi Education
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభం
హైదరాబాద్‌లోని పరిశోధనశాలలు, అత్యున్నత విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH)ను ఫిబ్రవరి 24న ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంతో పాటు వాటిని సామాన్య ప్రజల చెంతకు చేర్చడమే దీని ప్రధాన లక్ష్యం.
విజయవాడలో మేధోసంపత్తి, వాణిజ్య చట్టాల సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో "మేధో సంపత్తి, వాణిజ్య న్యాయాలు-చట్టాలు"అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకూ జరిగిన ఈ సదస్సుని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, జస్టిస్ రోహిణి, జపాన్ న్యాయమూర్తి జస్టిస్ అకిర కటసే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్ విదేశీ వాణిజ్య సంస్థ- జెట్రో సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్‌తో వీసా అవగాహనా ఒప్పందం
విశాఖపట్నం దేశంలోనే తొలి నగదు రహిత నగరంగా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థ వీసాతో ఫిబ్రవరి 23న అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 70 శాతంగా ఉన్న ఎలక్ట్రానిక్ చెల్లింపులను 100 శాతానికి చేర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు
అంతర్జాతీయ బౌద్ధ సదస్సును తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు సహా జాతీయ, స్థానిక ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో సిర్పూర్ పట్టణ శివారులోని నాగమ్మ చెరువులో 40 అడుగుల బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో వీఆర్‌ఏల వేతనం పెంపు
రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు-VRAల వేతనాన్ని 64.61 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 24న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీరి వేతనం రూ.10,500 పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయి. అలాగే వీఆర్‌ఏలకు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన సీఎం వీఆర్‌వో, అటెండర్, డ్రైవర్ తదితర నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని 19,345 వీఆర్‌ఏలు ప్రయోజనం పొందుతారు.
తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ సలీం
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఆయన అభ్యర్థిత్వానికి సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వక్ఫ్‌బోర్డ్ సీఈవో అసదుల్లా ప్రకటించారు.
ఏఎన్‌యూలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం సదస్సు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఫిబ్రవరి 24 నుంచి 25 వరకూ జరిగిన సదస్సుకి మంగళూరు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, తత్వవేత్త ప్రొఫెసర్ వలీరియన్ రోడ్రిగస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బుద్ధిజం తత్వవేత్తలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణలో వైద్య విద్య పరిశోధనలకు మెరిట్
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వెద్య విద్య, పరిశోధన (మెరిట్) అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో చదివే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు, అధ్యాపకులు వ్యక్తిగతంగా లేదా బృందాలుగా వివిధ అంశాలపై పరిశోధన చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ ఆర్థిక సహాయం అందిస్తారు. కార్యక్రమ అమలు కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది.
చంచల్‌గూడ్ జైళ్ల్లో ఈ-ములాఖత్ ప్రారంభం
హైదరాబాద్ చంచల్‌గూడ్ కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ సేవలను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 25న ప్రారంభించారు. ఖైదీలను కలవాలని అనుకునే వారుeprisons.nic.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలో గిరిజనుల స్థితిగతులపై నివేదిక విడుదల
రాష్ట్రంలో ఎస్టీలు అక్షరాస్యత, మాతా శిశుమరణాలు, కనీస సౌకర్యాల విషయంలో చాలా వెనుకబడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వారి స్థితిగతులపై అధ్యయనం చేసిన ఎస్టీ విభాగం గణాంకాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్లకు అందజేసింది.
సర్వే ముఖ్యాంశాలు
తెలంగాణలో అంగన్‌వాడీల వేతనాలు 50 శాతం పెంపు
తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.7 వేలుగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.10,500కు పెరిగింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనం రూ.4,500 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 67,411 మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆడ పిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని తెలిపారు. మాతా శిశు సంక్షేమంలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్(87) ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో 1929 ఆగస్టు 10న జన్మించిన శివశంకర్ ఇందిరాగాంధీ హయాంలో కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దశాబ్దకాలంపాటు వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.
సుప్రీంకోర్టులో శివశంకర్ న్యాయ పోరాటంతో బీసీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విధానంతో పాటు రాష్ట్రంలో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా అజేయ కల్లం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఆయన బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
నెల రోజుల పాటు సీఎస్‌గా పనిచేయనున్న అజేయ కల్లం మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దినేశ్ కుమార్ చేపడతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌స జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఉన్న షమీమ్ అక్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో వెంకటేశ్వరరెడ్డిని నియమించిన హైకోర్టు రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌స జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేసింది.
కొలనుపాకను దత్తత తీసుకున్న దత్తాత్రేయ
ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద యాదాద్రి జిల్లాలోని కొలనుపాకను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రెండేళ్ల పాటు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన రెండు వేల ఏళ్ల నాటి జైన దేవాలయం ఉంది.
తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ పదవీ విరమణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా, సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అధికారిగా అరుణా బహుగుణ గుర్తింపు పొందారు. అంతకుముందు ఆమె సిటీ జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారిగానూ పనిచేశారు.
జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా డోలే బర్మన్
సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ-NPA కొత్త డెరైక్టర్‌గా డీఆర్ డోలేబర్మన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన డోలేబర్మన్ ఈ నియామకానికి ముందు మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా పనిచేశారు. 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారాన్ని ముందుగానే గుర్తించినందుకు ఆమె ఎస్‌ఎస్‌బీ డీజీపీ అవార్డు అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా షేర్-ఈ-కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను పొందారు.
డీఆర్ డోలేబర్మన్ జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా నియమితులైన రెండో మహిళా అధికారి కాగా ఈ సంస్థకు మొదటి మహిళా డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఐపీఎస్ అరుణ బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
అర్బన్ ప్లానింగ్‌లో హైదరాబాద్‌కు నాలుగో స్థానం
‘పట్టణ ప్రణాళిక’ (అర్బన్ ప్లానింగ్)లో హైదరాబాద్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు జనాగ్రహ అనే సంస్థ ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 21 ప్రధాన నగర మున్సిపాలిటీల్లో పాలన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రణాళిక, సాధికారత వంటి అంశాల ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా భువనేశ్వర్, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రపతి విందుకు నారాయణఖేడ్ యువకుడు
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మార్చి 6న జరిగే ‘ప్రజెంటేషన్ ఆఫ్ విజి టర్స్ అవార్డు-17’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పాండురంగారావు వెళ్లనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. బైక్ మెకానిక్ అయిన పాండురంగారావు పంక్చర్‌కాని ట్యూబ్‌లెస్ టైర్‌ను తయారు చేశారు. దీంతో పాటు విద్యుత్ స్తంభాలను సులభంగా ఎక్కేందుకు క్లచ్చర్స్ తయారు చేశారు. ఈ ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో పాండురంగారావు రూపొందించిన పరికరానికి గుర్తింపు లభించింది.
హైదరాబాద్‌లో 14వ బయో ఏసియా సదస్సు
14వ బయో ఏసియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. HICC వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్ (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు.
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 31న ప్రారంభించారు. దీన్ని కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా) మండలాల్లోని మొత్తం 60 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.
చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
తెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ఎంపికైంది. జనవరి 31 చేనేత వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కె.తారకరామారావు ఈ మేరకు ప్రకటన చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మొదటి మహిళా రేడియో న్యూస్ రీడర్ మంగమ్మ మృతి
ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోలెపాళెం మంగమ్మ(92) చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఫిబ్రవరి 1న కన్నుమూశారు. మంగమ్మ సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 12న జన్మించారు. 1952లో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరి పదేళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాసిన ఆమె 2002లో తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట పురస్కారాలూ పొందారు.
బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం జోన్లు, ప్రాజెక్టుల వారీ వివరాలను ఫిబ్రవరి 3న వెల్లడించింది. ఈ సారి కొత్త రైళ్లేవి లేకుండా కొత్త లైన్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
ఏపీ, తెలంగాణకు కేటాయింపులు
తెలంగాణలో మహిళలకు స్త్రీ నిధి ఫోన్లు
గామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని స్త్రీ నిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది రూ.50 కోట్లతో రాష్ట్రంలోని 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను అందించనుంది. మొబైల్ ఫోన్ సమకూర్చుకునేందుకు స్త్రీ నిధి బ్యాంకు తరపున ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున రుణం ఇవ్వనున్నారు.
విజయవాడలో నౌకాదళ విన్యాసాలు
విజయవాడ పున్నమి ఘాట్‌లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకూ మూడు రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి. నౌకాదళంపై యువతలో ఆసక్తి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్ర సమర యోధురాలు సామ్రాజ్యం కన్నుమూత
విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమర యోధురాలు రాచర్ల సామ్రాజ్యం (98) ఫిబ్రవరి 6న కన్నుమూశారు. రాజమహేంద్రవరంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919లో జన్మించిన సామ్రాజ్యం 1932లో కాకినాడ రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావును వివాహమాడారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో అరెస్టయి 6 నెలల పాటు రాయవెల్లూరు జైళ్లో ఉన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తామ్రపత్రంతో సత్కరించింది.
ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో రూ.1.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. వారి షర్టుపై ‘ఐయామ్ ఏ కాప్’ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలి రంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు.
ఎస్వీయూలో జాతీయ వీసీల సదస్సు
అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5 - 7 వరకు జరిగింది. సదస్సులో దేశవ్యాప్తంగా 300 మంది వీసీలు పాల్గొని ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై చర్చించారు. టిబెట్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిన్నారులకు టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ శిక్షణ కేంద్రంను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న జూబ్లిహిల్స్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంలో 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ-SMTA 2013లో ఏర్పాటైంది.
2015లో ఏపీలో ప్రజల స్థితిగతులపై సెస్ నివేదిక
2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ-SES నివేదిక విడుదల చేసింది. నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా మానవాభివృద్ధి సూచీని ‘సెస్’ లెక్కగట్టింది. ఈ అంశాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని వివరించింది.
సెస్ మానవాభివృద్ధి సూచీలో జిల్లాల స్థానం

- రాష్ట్రంలో సాధారణ అక్షరాస్యత 67.61 శాతం. ఎస్టీల్లో 48.63 శాతం.
- రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీల పిల్లలు 33 శాతం.
- రాష్ట్రంలో 26.83 శాతం మంది పిల్లలు పదో తరగతిలోపు బడి మానేస్తుండగా ఎస్టీల్లో ఆ శాతం 60.37గా ఉంది.
- మాతా, శిశు మరణాలు సాధారణంగా ప్రతి లక్ష మందికి 92 ఉంది. అదే ఎస్టీల్లో 195గా నమోదైంది. శిశు మరణాలు ప్రతి వెయి్య మందికి సాధారణంగా 39 ఉండగా ఎస్టీల్లో 68గా ఉంది.
- రాష్ట్రంలో 44 శాతం ఎస్టీ కుటుంబాలకు మాత్రమే ఇళ్లు ఉన్నాయి.
- 29 శాతం మంది పిల్లలు సమీకృత శిశు అభివృద్ధి కేంద్రాలకు దూరంగా ఉన్నారు.
- రక్షిత మంచినీటి సరఫరా లేని ఎస్టీ నివాస ప్రాంతాలు 47 శాతం.
- 44 శాతం ఎస్టీ నివాస ప్రాంతాలకు రహదారులు లేవు.
తెలంగాణలో అంగన్‌వాడీల వేతనాలు 50 శాతం పెంపు
తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.7 వేలుగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.10,500కు పెరిగింది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనం రూ.4,500 నుంచి రూ.6,000 వేలకు పెరిగింది. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తల హోదాను అంగన్‌వాడీ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 67,411 మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆడ పిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని తెలిపారు. మాతా శిశు సంక్షేమంలో భాగంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి పుంజల శివశంకర్(87) ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో 1929 ఆగస్టు 10న జన్మించిన శివశంకర్ ఇందిరాగాంధీ హయాంలో కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దశాబ్దకాలంపాటు వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.
సుప్రీంకోర్టులో శివశంకర్ న్యాయ పోరాటంతో బీసీ రిజర్వేషన్లలో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విధానంతో పాటు రాష్ట్రంలో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా అజేయ కల్లం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఆయన బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
నెల రోజుల పాటు సీఎస్‌గా పనిచేయనున్న అజేయ కల్లం మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దినేశ్ కుమార్ చేపడతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌స జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఉన్న షమీమ్ అక్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో వెంకటేశ్వరరెడ్డిని నియమించిన హైకోర్టు రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్‌స జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేసింది.
కొలనుపాకను దత్తత తీసుకున్న దత్తాత్రేయ
ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద యాదాద్రి జిల్లాలోని కొలనుపాకను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రెండేళ్ల పాటు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న ప్రకటించారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన రెండు వేల ఏళ్ల నాటి జైన దేవాలయం ఉంది.
తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ పదవీ విరమణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా, సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అధికారిగా అరుణా బహుగుణ గుర్తింపు పొందారు. అంతకుముందు ఆమె సిటీ జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారిగానూ పనిచేశారు.
జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా డోలే బర్మన్
సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ-NPA కొత్త డెరైక్టర్‌గా డీఆర్ డోలేబర్మన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 1986 జమ్మూకశ్మీర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన డోలేబర్మన్ ఈ నియామకానికి ముందు మేఘాలయ రిబోయి జిల్లాలోని ఉమియాం నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా పనిచేశారు. 2008లో గౌహతిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సమాచారాన్ని ముందుగానే గుర్తించినందుకు ఆమె ఎస్‌ఎస్‌బీ డీజీపీ అవార్డు అందుకున్నారు. సేవలకు గుర్తింపుగా షేర్-ఈ-కశ్మీర్ పతకం, ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను పొందారు.
డీఆర్ డోలేబర్మన్ జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా నియమితులైన రెండో మహిళా అధికారి కాగా ఈ సంస్థకు మొదటి మహిళా డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ఐపీఎస్ అరుణ బహుగుణ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు.
అర్బన్ ప్లానింగ్‌లో హైదరాబాద్‌కు నాలుగో స్థానం
‘పట్టణ ప్రణాళిక’ (అర్బన్ ప్లానింగ్)లో హైదరాబాద్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు జనాగ్రహ అనే సంస్థ ఫిబ్రవరి 28న ఓ నివేదిక విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 21 ప్రధాన నగర మున్సిపాలిటీల్లో పాలన, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రణాళిక, సాధికారత వంటి అంశాల ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా భువనేశ్వర్, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్రపతి విందుకు నారాయణఖేడ్ యువకుడు
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మార్చి 6న జరిగే ‘ప్రజెంటేషన్ ఆఫ్ విజి టర్స్ అవార్డు-17’ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పాండురంగారావు వెళ్లనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. బైక్ మెకానిక్ అయిన పాండురంగారావు పంక్చర్‌కాని ట్యూబ్‌లెస్ టైర్‌ను తయారు చేశారు. దీంతో పాటు విద్యుత్ స్తంభాలను సులభంగా ఎక్కేందుకు క్లచ్చర్స్ తయారు చేశారు. ఈ ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో పాండురంగారావు రూపొందించిన పరికరానికి గుర్తింపు లభించింది.
పీఎస్‌సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఫిబ్రవరి 19న ఏకగ్రీవ ంగా ఎన్నికయ్యారు. గుజరాత్‌లో జరిగిన రెండు రోజుల పీఎస్‌సీల నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఈ ఎంపిక జరిగింది. రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసులైన గ్రూప్-1, 2 పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఒకే పద్ధతిని అమలు చేయాలని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు నిర్ణయించారు. ఈ విధానంలో.. సిలబస్‌లో 70 శాతం ఒకే విధంగా, మిగిలిన 30 శాతం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలుంటాయి.
భూమిలేని కుటుంబాలకు ప్యాకేజీ
నీటిపారుదల ప్రాజెక్టుల అవసరాలకు జీవో 123 కింద చేపట్టిన భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే భూమిలేని కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 14న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ భూమిలేని కూలీలు, వృత్తికళాకారులు, కౌలుదార్లకు వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజావ సరాల కోసం భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం 2015, జూలై 30న జీవో 123ను జారీ చేసింది.
TSIICలో మూడు కొత్త జోన్లు
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ-TSIICలో 3 కొత్త జోన్లు ఏర్పాటయ్యాయి. నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి కేంద్రంగా వీటిని ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 15న సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట కేంద్రంగా సబ్ జోన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో TSIIC జోన్ల సంఖ్య 9కి చేరింది.
హైదరాబాద్‌లో ఏరోనాటికల్ నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం
ఏయిర్‌బస్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఏరో స్కూల్ ఆక్విటైన్ ఆఫ్ ఫ్రాన్స్ సంస్థలు హైదరాబాద్ బేగంపేటలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. బెంగళూరులో ఫిబ్రవరి 15న ముగిసిన ఏరో ఇండియా-2017 సదస్సులో ఆయా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలో ఏరోనాటికల్ పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా కోర్సుల రూపకల్పన చేసి శిక్షణ ఇస్తారు. ప్రపంచంలో ప్రముఖ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వర్సిటీల్లో ఒకటైన యూకేలోని క్రాన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ డిస్కంలకు రూ.1,700 కోట్లు
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 కోట్లను పెట్టుబడి మూలధనంగా విడుదల చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ-TSSPDCL, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ-TSNPDCLలకు 70:30 నిష్పత్తిలో ఈ పెట్టుబడులను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ రెండింటిలో కలిపి రాష్ట్ర మూలధనం వాటా రూ.998 కోట్ల కాగా తాజా కేటాయింపులతో అది రూ.2,698 కోట్లకు పెరిగింది.
విజయవాడ మెట్రోకు జర్మనీ నుంచి రూ.2,600 కోట్ల రుణం
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ రూ.2600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం కేంద్రం భరించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది.
తెలంగాణలో ఎంబీసీలకు కార్పొరేషన్
తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి సంస్థ-MBC (Most Backward Classes Development Corporation)ని ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎంబీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిబ్రవరి 20న నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఈ మేరకు వెల్లడించారు. కార్పొరేషన్ కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని వాటిని ఎలా ఖర్చు చేయాలన్నది కూడా ఎంబీసీ ప్రతినిధులే నిర్ణయించే విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.
మహాదాత మట్టపల్లి చలమయ్య కన్నుమూత
పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత మట్టపల్లి చలమయ్య (94) ఫిబ్రవరి 20న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1923 నవంబర్ 19న తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించిన చలమయ్య తండ్రి బాటలోనే పయనిస్తూ వ్యాపార రంగంలో ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చి సామర్లకోట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న 5 వేల మంది శరణార్థులకు చలమయ్య ప్రతి రోజూ అన్నం పెట్టారు. తద్వారా మహాదతగా ఆయన గుర్తింపు పొందారు.
విశాఖ విమానాశ్రయానికి ఏ గ్రేడ్ హోదా
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. 2016-17లో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఏడాదిలో 20 లక్షల ప్రయాణికులు దాటిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏ గ్రేడ్ హోదా కల్పిస్తారు.
దేశంలో ఏ గ్రేడ్ హోదా పొందిన విమానాశ్రయాలు: శ్రీనగర్, గోవా, కోచి, పుణె, విశాఖపట్నం
‘గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం’ పుస్తకావిష్కరణ
కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె రచించిన 'గోదావరి జలాల పరిపూర్ణ వినియోగం-తెలంగాణ, జాతీయ దృక్పథం' ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ ఫిబ్రవరి 8న ఢిల్లీలో జరిగింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ఉమాభారతి, బండారు దత్తాత్రేయ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీరాం వెదిరె ప్రస్తుతం రాజస్తాన్ నదీ జలాల అథారిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద తొలి జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ప్రముఖ గాంధేయవాది ఈలా భట్, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ శిరిన్ షార్మిన్ చౌదరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చట్టసభల్లోని మహిళా సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు సదస్సులో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తారు.
టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా నారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం-TTDపాలక మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడిన శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి నుంచి తప్పించారు. ఖాళీ అయిన ఆ స్థానంలో సుధా నారాయణమూర్తిని నియమించారు.
తెలంగాణకు ఎయిమ్స్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి All india institute of medical sciences-AIIMS ను మంజూరు చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 9న లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక వైద్య సేవల సంస్థను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకూ ఎయిమ్స్ మంజూరైంది.
ఏపీ క్రీడా విధానానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కొత్తగా ప్రతిపాదించిన క్రీడా విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్పోర్ట్స్ పాలసీ పేరుతో పిలిచే ఈ విధానం 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. కొత్త క్రీడా విధానంలో మౌలిక సౌకర్యాల కల్పన, కోచ్‌ల నియామకం, ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు, టోర్నీల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.
62 శాతం మంది గర్భిణీల్లో పోషకాహార లోపం
తెలంగాణ రాష్ట్రంలో సగటున వంద మంది గర్భిణీల్లో ఏకంగా 62 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద జనవరిలో పోషకాహార పంపిణీపై మహిళా శిశు సంక్షేమ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మొత్తంగా బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద నమోదైన వారిలో కేవలం 20.80 శాతం మాత్రమే లబ్ధిపొందుతున్నారని సర్వేలో తేలింది.
హైదరాబాద్‌లో దలైలామా నైతిక విలువల కేంద్రం
భారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న హైదరాబాద్‌కు వచ్చిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా.. మాదాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న దలైలామా నైతిక విలువల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఇది దక్షిణాసియా హబ్‌గా వ్యవహరించనుంది. దలైలామా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులోనూ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 కరువు మండలాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఖరీఫ్‌లో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో 268 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మరోసారి పరిశీలించిన ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో 13, ప్రకాశంలో 10, శ్రీకాకుళంలో 4, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చింది. దీంతో 2016 ఖరీఫ్‌లో ప్రకటించిన దుర్భిక్ష మండలాల సంఖ్య 301కి చేరింది.
టీటీడీ బడ్జెట్ రూ.2,858 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ. రూ.2,858.48 కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆమోదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకల ద్వారా రూ.1,110 కోట్లు రావచ్చని అంచనా వేసింది. 2016-17 టీటీడీ బడ్జెట్ రూ. రూ.2,678 కోట్లు.
ఏపీలో మూడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటు
ఫిబ్రవరి 14న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్రంలో కొత్తగా 3 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. చంద్రన్న బీమా కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
కేబినెట్ నిర్ణయాలు

- 3,098.46 చ.కి.మీ. పరిధితో అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలోకి 8 మండలాల్లోని 177 గ్రామాలు.
- కాకినాడ 2,215.50 చ.కి.మీ. విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు.
- కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కి.మీ. విస్తీర్ణంలో కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.
- ఏపీ సైబర్ సెక్యూరిటీ విధానం-2017కు ఆమోదం.
- 2017-18ను ఇ-ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం.
- మాతృ మూర్తులపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం.
హైదరాబాద్‌లో 14వ బయో ఏసియా సదస్సు
14వ బయో ఏసియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. HICC వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్ (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు.
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 31న ప్రారంభించారు. దీన్ని కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా) మండలాల్లోని మొత్తం 60 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది.
చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
తెలంగాణలో చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి సమంత ఎంపికైంది. జనవరి 31 చేనేత వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కె.తారకరామారావు ఈ మేరకు ప్రకటన చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత లక్ష్మీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మొదటి మహిళా రేడియో న్యూస్ రీడర్ మంగమ్మ మృతి
ఆలిండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోలెపాళెం మంగమ్మ(92) చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఫిబ్రవరి 1న కన్నుమూశారు. మంగమ్మ సుబ్బన్న, లక్ష్మమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 12న జన్మించారు. 1952లో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా చేరి పదేళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాసిన ఆమె 2002లో తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట పురస్కారాలూ పొందారు.
బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం జోన్లు, ప్రాజెక్టుల వారీ వివరాలను ఫిబ్రవరి 3న వెల్లడించింది. ఈ సారి కొత్త రైళ్లేవి లేకుండా కొత్త లైన్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
ఏపీ, తెలంగాణకు కేటాయింపులు
- దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు.
- ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు.( కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ. 350 కోట్లు, బల్షారా-కాజీపేట- విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు).
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు రూ.3,406 కోట్లు.
- ఇందులో విజయవాడ-అమరావతి-గుంటూరులను కలుపుతూ 106 కి.మీ. మేర నిర్మించే అమరావతి రైలు మార్గానికి రూ.2,680 కోట్లు.
తెలంగాణలో మహిళలకు స్త్రీ నిధి ఫోన్లు
గామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని స్త్రీ నిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది రూ.50 కోట్లతో రాష్ట్రంలోని 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను అందించనుంది. మొబైల్ ఫోన్ సమకూర్చుకునేందుకు స్త్రీ నిధి బ్యాంకు తరపున ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున రుణం ఇవ్వనున్నారు.
విజయవాడలో నౌకాదళ విన్యాసాలు
విజయవాడ పున్నమి ఘాట్‌లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకూ మూడు రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి. నౌకాదళంపై యువతలో ఆసక్తి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్ర సమర యోధురాలు సామ్రాజ్యం కన్నుమూత
విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమర యోధురాలు రాచర్ల సామ్రాజ్యం (98) ఫిబ్రవరి 6న కన్నుమూశారు. రాజమహేంద్రవరంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919లో జన్మించిన సామ్రాజ్యం 1932లో కాకినాడ రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావును వివాహమాడారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో అరెస్టయి 6 నెలల పాటు రాయవెల్లూరు జైళ్లో ఉన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తామ్రపత్రంతో సత్కరించింది.
ఏపీలో మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో రూ.1.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. వారి షర్టుపై ‘ఐయామ్ ఏ కాప్’ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలి రంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు.
ఎస్వీయూలో జాతీయ వీసీల సదస్సు
అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5 - 7 వరకు జరిగింది. సదస్సులో దేశవ్యాప్తంగా 300 మంది వీసీలు పాల్గొని ‘స్వాతంత్య్రం అనంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై చర్చించారు. టిబెట్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ సాంథోంగ్ రిన్‌పచీ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిన్నారులకు టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ శిక్షణ కేంద్రంను ప్రారంభించింది. ఫిబ్రవరి 6న జూబ్లిహిల్స్‌లో ప్రారంభమైన ఈ కేంద్రంలో 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ-SMTA 2013లో ఏర్పాటైంది.
2015లో ఏపీలో ప్రజల స్థితిగతులపై సెస్ నివేదిక
2015లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల స్థితిగతులపై సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ-SES నివేదిక విడుదల చేసింది. నెలవారీగా తలసరి వ్యయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాఠశాలల్లో ఉండటం, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా మానవాభివృద్ధి సూచీని ‘సెస్’ లెక్కగట్టింది. ఈ అంశాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని వివరించింది.
సెస్ మానవాభివృద్ధి సూచీలో జిల్లాల స్థానం
జిల్లా | ర్యాంకు |
కృష్ణా | 1 |
పశ్చిమ గోదావరి | 2 |
నెల్లూరు | 3 |
చిత్తూరు | 4 |
తూర్పు గోదావరి | 5 |
గుంటూరు | 6 |
వైఎస్సార్ కడప | 7 |
ప్రకాశం | 8 |
విశాఖపట్నం | 9 |
విజయనగరం | 10 |
కర్నూలు | 11 |
శ్రీకాకుళం | 12 |
అనంతపురం | 13 |
Published date : 11 Feb 2017 10:29AM