NCeG: 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
హైదరాబాద్‌లో 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును జనవరి 7న కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలసి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించి, మాట్లాడారు. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ విధానాన్ని పునః సమీక్షించాలని.. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఏడున్నరేళ్లలో రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని.. ఈ రంగంలో రాష్ట్రానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బలబీర్ నౌకను నిర్మించిన సంస్థ?
హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ నిర్మించిన బలబీర్ నౌక ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 7న విశాఖపట్నంలో జరిగింది. 12 నాట్స్ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కల ఈ నౌక 50 టన్నుల బోలార్ట్ పుల్ టగ్‌ను కలిగి ఉంది. కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లోనూ హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ ఈ నౌక నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సంస్థ ఇప్పటివరకు రెండు వందల నౌకల నిర్మాణాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
చదవండి: ‘స్మార్ట్’ అధ్యయనానికి ఎంపికైన నగరాలు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్