Skip to main content

Australian Studies Center: రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ సెంటర్‌ ప్రారంభమైంది?

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆస్ట్రేలియన్‌ అధ్యయన కేంద్రం(ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ సెంటర్‌) ఏర్పాటైంది.
Australian Studies Center-ANU

ఈ కేంద్రాన్ని చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ కార్యాలయ వైస్‌ కాన్సుల్‌ ఆండ్రూ కోలిస్టర్‌ సెప్టెంబర్‌ 1న ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోలిస్టర్‌ ప్రసంగిస్తూ... అధ్యయన కేంద్రం ద్వారా ఆస్ట్రేలియాకు సంబంధించిన అంశాలపై విద్య, పరిశోధనాంశాలు కొనసాగుతాయన్నారు. సాంస్కృతిక, సాహిత్య అంశాల అధ్యయనం ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు.

వేర్పాటువాద నాయకుడు అలీ షా గిలానీ మృతి
జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నిషేదిత జమాత్‌–ఈ–ఇస్లామీ సభ్యుడు, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చైర్మన్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 1న కన్నుమూశారు. గిలానీ గతంలో ఎమ్మెల్యేగా చేశారు. 2020 ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. హురియత్‌ కాన్ఫరెన్స్‌కు రాజీనామా చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆస్ట్రేలియన్‌ అధ్యయన కేంద్రం(ఆస్ట్రేలియన్‌ స్టడీస్‌ సెంటర్‌) ప్రారంభం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 1
ఎవరు    : చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ కార్యాలయ వైస్‌ కాన్సుల్‌ ఆండ్రూ కోలిస్టర్‌
ఎక్కడ    : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు జిల్లా
ఎందుకు  : ఆస్ట్రేలియాకు సంబంధించిన అంశాలపై విద్య, పరిశోధనాంశాలను కొనసాగించేందుకు...
 

Published date : 02 Sep 2021 05:38PM

Photo Stories