Skip to main content

Andhra Pradesh Cabinet Meeting : కేబినెట్ మీటింగ్‌.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జూలై 12వ తేదీన (బుధవారం) కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. కేబినెట్ మీటింగ్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
ap cm ys jagan mohan reddy cabinet meeting telugu news
AP CM YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్‌ భేటీలో 55 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

కేబినెట్‌ భేటీలోని కీల‌క అంశాలు ఇవే..
☛ అనైన్డ్‌ల్యాండ్‌ ఉన్న రైతులకు అనుకూలంగా కేబినెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ ల్యాండ్‌ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. 
☛ మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  
☛ ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్‌ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. 
☛ 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది. 
☛ రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ. తద్వారా పూర్తి హక్కుల కల్పన. 
☛ వైఎస్సార్‌ సున్నా వడ్డీ ​ఈ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
☛ కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేబినెట్‌.
☛ వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
☛ అలాగే.. ఎస్ఐ‌పీబీ సమా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.
☛ రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
☛ ఇక.. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 
☛ టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
☛ కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం
☛ జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇంకా..
☛ జూలై 18న జగనన్న తోడు నిధుల జమ
☛ జూలై 20న సీఆర్‌డీఏ, ఆర్‌5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
☛ జూలై 21న నేతన్న నేస్తం నిధుల జమ
☛ జూలై 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ
☛ జూలై 28న జగన్న విదేశీ విద్యా పథకం

Published date : 12 Jul 2023 05:16PM

Photo Stories